తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఒక జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడినట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని కేటీఆర్ స్వయంగా తన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలియజేశారు. కేటీఆర్ కు గాయాలు… స్వయంగా తెలిపిన కేటీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ పడడంతో తనకు గాయాలయ్యాయని, వైద్యులు కొద్దిరోజుల పాటు తనను విశ్రాంతి తీసుకోవాలని సూచించారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నానని కేటీఆర్ తన పోస్టులో వివరించారు. ఈ గాయం నుంచి కోలుకొని వీలైనంత త్వరగా రోజువారీ కార్యక్రమాలలో పాల్గొంటానని ఆయన తన పోస్టు ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. ఇక కేటీఆర్ గాయపడిన విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, అభిమానులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఇక కేటీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడిన క్రమంలో కేటీఆర్ చేసిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష సోదరుడు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ లో వ్యాయామం చేస్తూ గాయపడ్డారని తెలిసిందని, వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన విశ్రాంతి తీసుకోవాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఇక మరోవైపు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కు గాయం కావడం పైన స్పందించారు. జగన్, లోకేష్ ట్వీట్స్ ట్విట్టర్ వేదికగా బ్రదర్ కేటీఆర్ అంటూ పోస్ట్ చేసిన వైయస్ జగన్ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ జగన్ పేర్కొన్నారు. ఇక మరోవైపు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆత్మీయులు కేటీఆర్ జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుండగా గాయమైంది అని తెలిసి బాధపడ్డాను అని పేర్కొన్న నారా లోకేష్ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.