జిల్లాలో వరి ఉత్పత్తిని పెంచేలా చేసిన కెసిఆర్
రైతుబంధు ఉంటే కెసిఆర్‌ను గుర్తుంచుకుంటారన్న కుళ్లు
రైతుభరోసా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు
ఇచ్చిన హామీలపై ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలి
నల్లగొండలో ఇదో విజయోత్సవ సభలా ఉంది
నల్లగొండ రైతు ధర్నాలో బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు
ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్లగొండ అని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ ఏం చేశారని అసెంబ్లీలో ఓ మంత్రి అడిగారన్న ఆయన.. వరి ఉత్పత్తిలో జిల్లాను నెంబర్ వన్ చేశారని చెప్పారు. ఇక్కడికి గోదావరి జలాలను తరలించిన ఘనత కెసిఆర్‌దని అన్నారు. నల్గొండ క్లాక్‌టవర్ కూడలిలో బిఆర్ఎస్ రైతు మహా ధర్నాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తొలుత నాగార్జున కళాశాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ నివాళులర్పించారు. అక్కడి నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..‘ రైతు బంధు కింద కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రూ.73 వేల కోట్లు ఇచ్చింది. నల్లగొండ బిడ్డలు జీవచ్ఛవంగా మారడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం అవుతుందని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతుబంధు నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తే ఆయనను ఎవరూ దేకరని, ఆ పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ పేరే నిలబడుతదనే భయం సీఎం రేవంత్ రెడ్డి లో ఉన్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే రైతుబంధు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఇప్పుడు స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల కోసం రేవంత్ మళ్లీ రైతుభరోసా నాటకం ఆడుతున్నాడని, ఎన్నికలు అయిపోంగనే రైతుబంధు మళ్లీ బందేనని ఆయన విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను జనం నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అన్ని పంటలకు క్వింటల్‌కు రూ.500 బోనస్ ఇస్తమన్నడు. మరె ఎవరికన్నా బోనస్ పైసలు పడ్డయా..? ఇప్పుడు మాట మార్చి సన్నవడ్లు పండిస్తెనే బోనస్ ఇస్తం అంటున్నరు. ఇగ వ్యవసాయ మంత్రి అయితే సన్నవడ్లకు బోనస్ ఇచ్చుడు బాగుంది, రైతు భరోసా అక్కెరే లేదని రైతులే చెప్తున్నరు అంటున్నడు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నయ్ కాబట్టి రైతుభరోసా ఇస్తం అని నాటకమాడుతున్నరు. ఈ నాటకాలను రు గమనించాలె. ఎన్నికలు అయిపోంగనే రైతు భరోసా కూడా బందైతది’ అని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ అంటే వైఎస్‌ఆర్ యాదికొస్తరు. రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తుకొస్తరు. అందుకే రైతుబంధు ఇస్తే కేసీఆర్‌కే పేరు వస్తదని, ఆయనను ఎవరూ దేకరని రేవంత్‌రెడ్డి భయపడుతున్నడు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని రు ఇక్కడ గమనించాలె అని అన్నారు. రైతుభరోసా పేరుతో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హా ప్రకారం.. ఇప్పుడు రైతులకు ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ ఉన్నాడు.
కాంగ్రెసోళ్లు ఇప్పుడు మళ్లీ వోట్లు అడగడానికి వొస్తారు. అప్పుడు ఈ బాకీ డబ్బులు అడుగుండ్రి. రుణమాఫీ ఏమైందని అడుగుండ్రి. ఏమైంది బోనస్ అని అడుగుండ్రి. ఆరుగ్యారంటీలు ఏమైనయని నిలదీయుండని కేటీఆర్ నల్లగొండ రైతులను కోరారు. రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు పెద్దపెద్ద మాటలు చెప్పిండని, అధికారంలోకి వచ్చినంక ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని కేటీఆర్ విమర్శించారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కారు అట్టర్‌ప్లాప్ అయ్యిందన్నారు. అసెంబ్లీలో ఇదే విషయమై నిలదీస్తే రేవంత్ రెడ్డి నోరు మెదపలేదన్నారు. ఇప్పటికీ రుణమాఫీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.12 వేల కోట్లు కూడా దాటలేదన్నారు. ’ఇప్పుడు గ్రామ సభల్లో అధికారులను రైతులు నిలదీస్తున్నరు. ఏమాయె రుణమాఫీ అంటే సమాధానం లేదు. ఏమాయె ఆరు గ్యారంటీలు అంటే సమాధానం లేదు. కేసీఆర్ బిచ్చమేసినట్టు రూ.10 వేలే ఇస్తున్నడూ.. నేను రూ.15 వేలు ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరె ఇస్తున్నాడా రూ.15 వేలు..? ఆఖరికి రూ.12 వేలు ఇయ్యాలని నిర్ణయించారు.
పైగా అది చారిత్రాత్మక నిర్ణయం అని అంటున్నారు. మోసం చేసుడు గూడా చారిత్రాత్మకమేనా అంటూ కెటిఆర్ ఎద్దేవా చేశారు. జనవరి 26 రాత్రి నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పాడని, కానీ ఇంతవరకు రైతు భరోసా డబ్బులు రాలేదని ఆయన ఆరోపించారు.నల్లగొండ బిడ్డలు జీవచ్ఛవాలుగా మారడానికి కారణమే కాంగ్రెస్. నల్లగొండ రైతుల అవస్థకు కారణమే కాంగ్రెస్. కాంగ్రెస్ పాలనలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ లో విద్యార్థులు గొడ్డు కారంతో అన్నం తినాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఐటీ టవర్ కళ తప్పిందని విమర్శించారు. తన రాక సందర్భంగా నల్లగొండ ప్రజల ఆదరణ చూస్తుంటే.. తాను రైతు ధర్నాకు వొచ్చినట్లు లేదని, విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్లు ఉందని అన్నారు.వెంకట్‌రెడ్డి వచ్చినంక అండ్ల ఎవలన్న ఉన్నరో.. లేకుంటే తాగుబోతుల అడ్డా అయిందోగానీ, మొత్తానికైతే ఐటీ టవర్ కళ తప్పింది’ అన్నారు. ఒక విజయోత్సవ ఊరేగింపు జరిగినట్లుగా ఉంది. భారీగా ధర్నాకు తరలివచ్చిన నల్లగొండ రైతు బిడ్డలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని కేటీఆర్ చెప్పారు.