స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎన్నికలకు కేడర్‌ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో వికారాబాద్ జిల్లా నేతలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్‌కు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్‌ఎస్ ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాలను ప్రభావితం చేసే స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ దృష్టి సారించింది. మాజీమంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ బీసీ నేతల సమావేశం ఆదివారం జరగనుంది. ఆదివారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. బీసీల కులగణనతోపాటు ప్రస్తుత రాజకీయాలపై బీఆర్‌ఎస్ తరఫున కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.