Monday, May 12, 2025

నేను బద్దలయ్యే అగ్ని పర్వతంలా ఉన్నా

నా కూతరును కక్షతో జైలులో పెట్టారు.. తండ్రిగా నాకు బాధ ఉండదా?:కెసిఆర్ భావోద్వేగం

రాజకీయ కక్షతోనే తన కూమార్తెను జైళ్లో పెట్టారని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆరోపించారు. సొంత బిడ్డ జైళ్లో ఉంటే కన్న తండ్రిగా నాకు బాధగా ఉండదా ప్రస్తుతం తాను సలసల మరిగిపోయే అగ్ని పర్వతంలా ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన బిఆర్‌ఎస్ ఎల్‌పి మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ఎంఎల్‌ఎలు వరుసగా పార్టీ వీడటంతో బిఆర్‌ఎస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న వ్యాఖ్యలకు సైతం గులాబీ బాస్ కౌంటర్ ఇచ్చారు.

బిఆర్‌ఎస్ పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఏమి లేవని, ఇంతకంటే ఇబ్బంది కర పరిస్థితుల్లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొన్నటి వరకు నలుగురు ఎమ్మెల్యేలే ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అని తిరిగి ప్రశ్నించారు. అధికారంలో కంటే అపొజిషన్‌లో ఉన్నప్పుడే ఎంఎల్‌ఎ బాగా ఎదుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కాంగ్రెస్ పాలనపై పట్టు సాధించలేకపోయిందన్నారు. పాలనపై దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే పనిలోనే ఉన్నారని చురకలంటించారు. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో శాంతిభద్రతలు ఎందు కు అదుపు తప్పుతాయని నిలదీశారు.

ఎక్కడో ఉన్న వారిని చేరదీసి మంచి నేతలను చేసి పదవులు ఇస్తే వాళ్లు మాత్రం పదవులు అనుభవించి పార్టీ వీడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కెసిఆర్ పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పా రు. ఈ సమావేశంలో అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఏయే అంశాలను సభలో లేవనెత్తి అధికార పార్టీని ఇరుకున పెట్టాలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఎంఎల్‌ఎలకు సూచించారు. ఈ సందర్భంగా కెసిఆర్ కుమార్తె కవిత గురించి ప్రస్తావన వచ్చిన సందర్భంలో బిఆర్‌ఎస్ అధినేత పై విధంగా భావోద్వేగంగా స్పందించారు. మరోవైపు, శాసన మండలిలో బిఆర్‌ఎస్ పక్ష నేతగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ప్రకటించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com