-
కండువా కథేంది..?
-
పొరపాటా.. ఉద్దేశపూర్వకమా
-
హరీష్ రావు టీఆర్ఎస్ కండువా ఎందుకు వేసుకున్నట్టు..!
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్అష్టకష్టాలు పడుతున్నది. అసలు పార్టీ పేరు మార్చడమే తమ ఓటమికి కారణమని కొందరు నేతలు బహిరంగానే చెప్పారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్గా మారనుందని చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఓ మీడియా సమావేశంలో కేసీఆర్ స్పష్టత కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ పార్టీ పేరు మార్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రాన్ని సాధించింది. ఆ తర్వాత వరుసగా రెండు సార్లు తెలంగాణలో అధికారాన్ని చేపట్టింది. అయితే మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అనుకున్న సమయంలో ఓటమి పాలైంది. గత అసెంబ్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. అయితే తెలంగాణ ఏకైక అజెండాగా ఏర్పాటైన టీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్గా మారిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తామన్న కేసీఆర్ ఆ దిశగా శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రాతో పాటు ఏపీ, కర్ణాటకలో పోటీ చేయనున్నట్లు సైతం ప్రకటించారు. కానీ, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత కేసీఆర్ ఆ ఆలోచనను విమరించుకున్నారు.
కండువా ఎందుకు వేసుకున్నట్టు..?
తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధరించిన కండువా పార్టీ పేరు మార్పునకు సంబంధించి చర్చకు తెర తీసింది. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరైన హరీష్ రావు బీఆర్ఎస్ కండువాకు బదులుగా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీ పేరు మారుతోందనే చర్చకు దారి తీస్తుంది. పార్టీ పేరు మార్చే ఆలోచనలో పార్టీ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతాయి. అయితే మరికొందరు మాత్రం ఇదేదో పొరపాటుగా.. బీఆర్ఎస్ కండువా వేసుకోబోయి టీఆర్ఎస్ కండువా వేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. ఒకవేళ పార్టీ పేరు మారి ఉంటే అధికారింగా ప్రకటించే వారు కదా! అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పార్టీ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.