Saturday, April 5, 2025

సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగిస్తాం

బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం : కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. తిరిగి అధికారంలోకి వచ్చాక సచివాలయం ఎదుటు ఏర్పాటు చేయబోతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగిస్తామన్నారు. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పేరును కూడా మారుస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఎంటీ సంబంధమని కేటీఆర్ ప్రశ్నించారు.

వందలమంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ నాయకుడి విగ్రహాన్ని అక్కడ ఎలా పెడతారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనసు మార్చుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని.. లేకపోతే నాలుగేళ్ల తరువాత అధికారంలోకి వచ్చాక దాన్ని సకల మర్యాదలతో తొలిగిస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టాయలంటే జాబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంట్లోనో, గాంధీ భవన్ లోనో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com