కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ప్రకాశ్ గౌడ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా పార్టీ మారనున్నారని జోరుగా ప్రచారం సాగుతున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ గురువార బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్లోకి ఇద్దరు మున్సిపల్ ఛైర్మన్లు చేరనున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకోగా, ప్రకాశ్ గౌడ్ తో ఫిరాయింపు తో వారి సంఖ్య ఎనిమిదికి చేరనుంది.
దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి పడిపోనుంది. అయితే గతంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ ఇంతకాలం కాంగ్రెస్లో చేరబోతున్నారనే వార్తలను ఖండించారు. ఇక ఇటీవల హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబుతో ప్రకాష్ గౌడ్ భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నారా అన్న అనుమానాలు సైతం తలెత్తాయి. కానీ అన్ని అనుమానాలకు తెరతీస్తూ…. నేడు కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారు.