కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పర్యటించనున్నారు. నేడు అసెంబ్లీ సమావేశం అనంతరం బయల్దేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. గురువారం కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రత్యేక బస్సులో బయలుదేరి.. సాయంత్రం ఎల్ అండ్ డీ రిజర్వాయర్‌ను సందర్శించనున్నారు. గురువారం రాత్రి రామగుండంలో బీఆర్ఎస్ బృందం బస చేయనుంది. మర్నాడు శుక్రవారం ఉదయం 10 గం.కు కన్నెపల్లి పంపు హౌజ్‌ను పర్యటించనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు.