ఎవరెన్ని చెప్పినా.. ఎన్ని రకాల విశ్లేషణలు చేసినా.. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పోటీ కాంగ్రెస్‌తోనేనని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఎందుకంటే, లిక్కర్ స్కామ్‌లో ఏ-1 అయిన కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయలేదు. కారణం.. బీఆర్ఎస్‌తో బీజేపీకి కుదిరిన చీకటి ఒప్పందమేనని చెప్పొచ్చు. పైగా, ఇటీవల కాలంలో కేసీఆర్ నిర్వహించి బహిరంగ సభల్లో ఎక్కువగా కాంగ్రెస్‌ని తిట్టి పోస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎక్కువగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఏ బహిరంగ సభల్ని చూసినా.. కేసీఆర్ కాంగ్రెస్ వల్ల దేశం నాశనమైందని చెబుతున్నారు. హుస్నాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. అరవై ఏండ్లు రాజ్యం కాంగ్రెస్ ఎలగబెట్టిందని దుయ్యబట్టారు. దళితులు పేదరికంలో మగ్గుతున్నారంటే.. దేశం సిగ్గుతో తలదించుకోవాలంటూ విమర్శించారు. దళితబందు ఎప్పుడో ఆరంభమై ఉంటే దళితులకు మేలు జరిగేదన్నారు. పెన్షన్ ఐదు వేలకు పెంచుతున్నామంటూ హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పెన్షన్‌కు పోటీగానే కేసీఆర్ ఇలా పెంచారని ప్రజలు భావిస్తుండటం విశేషం.