ఎమ్మెల్యేల వలసలు టిఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా, తాజాగా మరో ఇద్దరు గుడ్ బై చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా
గెలుచుకోలేకపోయింది. దీంతో పార్టీ నుంచి వలసలు ఇంకా పెరుగుతాయని, పలువురు శాసనసభ్యులు కారు దిగుతారని చర్చ జరుగుతోంది.
ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేల వలసలపై సీరియస్ గా దృష్టి పెట్టి అడ్డుకట్ట వేయకపోతే మరింత ప్రమాదం పొంచి ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.