Thursday, January 16, 2025

త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం

  • త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం
  • ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం
  • బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్

బీఆర్ఎస్ పార్టీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాములా మారిందని విమర్శించారు. గ్యారేజ్ నుంచి కారు బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు డిపాజిట్లు దక్కడమే గగనమని తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీలో, బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు. తెలంగాణ వచ్చినప్పుడే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ కుటుంబంతో కలిసి సోనియా గాంధీ కాళ్ల ముందు మోకరిల్లిన సంగతి తెలంగాణ సమాజానికి తెలుసని, అయితే అధికార దాహంతో విడిగా పోయిన విషయం ప్రజలకు మర్చిపోలేదన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 360 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రావడం ఖాయమని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.

అడ్డగోలు హామీలతో రాష్ట్రాన్ని అప్పులుకుప్పలుగా సీఎం రేవంత్ రెడ్డి మార్చారని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ సైతం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతిపరులపై చర్యలు తీసుకోలేదని, ధరణి సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజాదరణను చూసి సహించలేక, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరోక్షంగా ఏకమై అనేక కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. అయితే తెలంగాణ ప్రజలు దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచి బీజేపీని గెలిపించేందుకు ముందడుగు వేశారని లక్ష్మణ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసి అలవిగాని హామీలు ఇచ్చారన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి ఆగస్టులోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పదని హెచ్చరించారు.

బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని చెప్పారు. హామీలు అమలుచేయకపోతే ప్రజలు కాదు, కాంగ్రెస్ నేతలే తిరగబడుతారని లక్ష్మణ్ హెచ్చరించారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు ఆ పార్టీని విశ్వసించలేదన్నారు. ఫేక్ వీడియో తయారు చేసిన రేవంత్ రెడ్డి ఫేక్ సీఎం అని ఎద్దేవా చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com