Sunday, November 17, 2024

విజయం సాధించేది బీఆర్ఎస్సే

గత మూడున్నర నెలలుగా ఎన్నికల కోసం పని చేసిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, నాయకులకు కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు పనిచేసిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి, అధికారికి ధన్యవాదాలు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దానితో సంబంధం లేకుండా త‌మ‌ విజయం పైన పూర్తి ధీమాగా ఉన్నామ‌న్నారు. ఇంకా కేటీఆర్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

2018లో కూడా కేవలం ఒక్క ఏజెన్సీ మినహా మిగిలినవి అన్నీ తప్పుడు ఫలితాలను సూచించాయి. తెలంగాణ ప్రజలను ఎగ్జిట్ పోల్స్ తో అయోమయానికి గురిచేయాలని చేసిన ప్రయత్నం ఫలించదు. ఎగ్జిట్ పోల్స్ ని తప్పు అని నిరూపించడం మా పార్టీకి కొత్త కాదు. అసలైన ఫలితం మూడవ తేదీన వస్తుంది. 70కి పైగా స్థానాలతో మా పార్టీ విజయం సాధిస్తుంది, మా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ని చూసి కార్యకర్తలు నాయకులు అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎన్నికల క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వారివి ప్రభావితం అయ్యేలా నిర్ణయం తీసుకోవడంపై ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సి ఈ ఓ తో మాట్లాడితే ఎన్నికల కమిషన్ నిబంధనలు అలాగే ఉన్నాయని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న నిబంధనలను మారిస్తే బాగుంటుంది. భవిష్యత్తులో ఆయన ఈ అంశం పైన దృష్టి పెట్టాలి. తమ ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలితే తెలంగాణ ప్రజలకు మూడవ తేదీన క్షమాపణ చెప్పేలి. ఎవరు అయోమయానికి గురి కావలసిన అవసరం లేదు కచ్చితంగా అధికారంలోకి వస్తున్నాం. దుష్ప్రచారాలు, అబద్ధాలు, నకిలీ వీడియోలతో ప్రజలను ప్రభావితం చేసేలా పని చేస్తున్న పార్టీలపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడం పైన ఆలోచించాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular