Tuesday, May 6, 2025

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు చిట్ చాట్ @ బీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం

మేడి గడ్డ బారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయి

లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుంది

ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది?

మున్ముందు బారేజ్ కు ఏమీ జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుంది

ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసు. వారు బారేజ్ ను ఏమైనా చేయగలరు

కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే యత్నం చేస్తోంది

NDSA రిపోర్టు ను అడ్డం పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయడం లేదు

ఎల్లంపల్లి నుంచి నీరు ఇప్పటికైనా ఎత్తిపోయడం సంతోషమే

అయితే 2 టీ ఎం సీ ల నీరు ఎత్తి పోస్తే సరిపోదు

కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తోంది

కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని విఫలమయ్యారు

నిన్న మేము మేడి గడ్డ వెళ్ళినపుడు పది లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి

28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా మేడి గడ్డ బారేజ్ తట్టుకుని నిలబడింది

ndsa రిపోర్టు కాదు అది nda రిపోర్టు

కాంగ్రెస్ బీజేపీ లు ఏ విషయం లో విభేదించినా కాళేశ్వరం మీద ఓకే వైఖరి తో ఉన్నారు

ఉత్తమ్ ndsa రిపోర్ట్ ఆధారంగా నడుచుకుంటారంటున్నారు ..బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటారు

పోలవరం కాఫర్ డాం కొట్టుకుపోయినపుడు ndsa రిపోర్టు ఎక్కడ పోయింది ?

90 టీఎంసీ ల నీళ్లు గోదావరి లో వృధా గా పోతున్నాయి. 90 టీఎంసీ ల నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తో సమానం

భేషజాలకు పోకండి ..కన్నె పల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి

ఎల్లంపల్లిలో 16 టీఎంసీ ల నీళ్ళే ఉన్నాయి .పద్నాలుగు టీఎంసీ ల నీళ్లు హైదరాబాద్ కు నిలువ ఉంచాలి…రెండు టీఎంసీ ల నీళ్లు లిఫ్ట్ చేశాకే ఆపే అవకాశం ఉంది

ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరు ,మిగతా రిజర్వాయర్లు నింపడానికి సరిపోవు

కన్నె పల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు

ఇపుడు ఏ ఎన్నికలు లేవు ..రాజకీయం చేయకండి

కాళేశ్వరం అనేది కరువు కు ఇన్సూరెన్స్

ఇప్పటికే రాష్ట్రం లో వర్ష పాతం 40 శాతం లోటు ఉంది

లిఫ్ట్ లకు విద్యుత్ ఖర్చు అయితే అవుతుంది ..రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే ఆ ఖర్చు ముఖ్యమా ?

గల్ఫ్ లో తాగు నీళ్ల కోసం ఖర్చు ఎంతయినా పెడతారు

కాళేశ్వరం బహుళ ప్రయోజనాలున్న ప్రాజెక్టు

కాళేశ్వరం కు డబ్బులవుతున్నాయని బాధ పడుతున్నవారు, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందంటున్నారు. అది ఎవరికి లాభం, అవినీతి కోసమే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టా ?

నీళ్లున్నపుడే ఖాళీ ప్రాజెక్టులు నింపి పెట్టుకోవాలి

ఆగస్టు 2 తర్వాత కేసీఆర్ తో చర్చించి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్ల విడుదల కోసం కార్యాచరణ ప్రకటిస్తాం

బారేజ్ గేట్లు తెరిచి ఉన్నా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు

సెప్టెంబర్ లో నీళ్లు లిఫ్ట్ చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుంది .అది సరి కాదు

మేము కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టినా సరిగా ప్రచారం చేసుకోలేక పోయాము

చేసింది సరిగా చెప్పుకోలేకే ఎన్నికల్లో ఓడిపోయాం

మెట్రో అలైన్ మెంట్ ను ఎంఐఎం మార్చమని ఒత్తిడి చేయడం వల్లే పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగ లేదు

ఈ సీఎం ప్రతిపక్షనేత అనే మూడ్ లోనే ఉన్నారు

ఎల్ అండ్ టీ గురించి సీఎం అసెంబ్లీ లో మాట్లాడిన తీరు బాగా లేదు

ఇది పెట్టుబడి దారులకు తప్పుడు సందేశం వెళ్లేలా చేసింది

ఎల్ అండ్ టీ చిన్న చితకా కంపెనీ యా ?

సీఎం అలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి ?

సీఎం కు అన్నిటిలో స్కాం లు కనిపిస్తున్నాయి

కోటి బతుకమ్మ చీరల పంపిణీ లో స్కాం ఎక్కడ కనిపిస్తోంది ?

సీఎం రేవంత్ బతుకమ్మ చీరలతో సహా దేంట్లో నైనా విచారణ చేసుకోవచ్చు

రాష్ట్రాన్ని కేన్సర్ ,ఎయిడ్స్ తో ఏ సీఎం అయినా పోలుస్తారా ?
ఇంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉంటుందా ?

షా వలి దర్గా పై మేము సుప్రీం కోర్టు లో ఇచ్చిన అఫిడవిట్ కరెక్ట్ యే
రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వెళుతారా ?

ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు లో రెయిల్ కారిడార్ ఉంది ..భూ సేకరణ లో ఇబ్బందులు ఉండవని ఎయిర్ పోర్టు కు ఆ మార్గం లో మెట్రో ప్రతిపాదించాం..

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com