బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పారు. గురువారం పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదన్నారు.
బస్సు లో డాన్స్ లు అంటూ కేటీఆర్ … మహిళలపై నోరు జారారు. దీంతో మహిలలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కాంగ్రెస్ ఆధ్వర్యం లో కేటీఆర్ దిష్టిబొమ్మ ల దగ్ధానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సారీ చెప్పారు.