Thursday, November 14, 2024

అడ్డగోలు నిర్ణయాలతో రైతులు ఆగం

ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చేతకాని హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు అవి అమలు చేయాలంటే సీఎం రేవంత్‌కు తలపానం తోకలోకి వొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేతకానప్పుడు అసలు హామీలు ఎందుకివ్వాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎగ్గొట్టడంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. చేతకాని హామీలు ఇవ్వడమెందుకు, అధికారంలోకి వొచ్చాక చేతులెత్తేయడం ఎందుకని ప్రశ్నించారు. అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని సంక్షోభంగా మార్చారని విమర్శించారు. నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు, నేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట అని ఫైరయ్యారు.  దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్‌ ఇచ్చే రిటర్న్ ‌గిఫ్ట్ ఇదేనా అని నిలదీశారు.

కాంగ్రెస్‌ ‌పాలనలో ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా అని విమర్శించారు. రేవంత్‌ ఏడాది ఏలికలో తెలంగాణ రైతుకు గోస తప్ప భరోసా లేనే లేదని ఎక్స్ ‌వేదికగా వెల్లడించారు. ఎవరేంటో మరోసారి తేలిపోయిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ‌నినాదం, విధానం జై కిసాన్‌ అని, కాంగ్రెస్‌ ‌పాలసీ ఎప్పటికీ నై కిసానే అని మండిపడ్డారు.

కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేందుకు కుట్రలు:

కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ నేతన్న కడుపు కొడుతున్నదని కేటీఆర్‌ ‌విమర్శించారు. బతుకమ్మ చీరులతో నేతన్నలకు కేసీఆర్‌ ఉపాధి కల్పించారని చెప్పారు. ఆ బతుకమ్మ చీరలపై కాంగ్రెసోళ్లకు విపరీతమైన కక్ష అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌పార్టీ వొచ్చి నేతన్నల మగ్గాలను మళ్లీ ఆపిందని, వారిని అప్పులపాలు చేసిందన్నారు. వారికి మళ్లీ ఉరితాడునిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular