ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, రాజకీయంగా తమకు అనుకూలంగా ఉందిన విపక్ష బిఆర్‌ఎస్ భావిస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కెటిఆర్ పాదయాత్ర ఆలోచన చేస్తున్నారు. అలాగే కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ అన్నారు.
ఎక్స్ వేదిగా నిర్వహించిన ‘ఆస్క్ కేటీఆర్’ క్యాంపెయిన్‌లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలోని అనేక పార్టీల నేతలు ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు, రేప్పుడు చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కేటీఅర్ ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. దాదాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ పాలన తెలంగాణకు ఒక శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హాలను నెరవేర్చే ఉద్దేశం ఏమాత్రం లేదు. అందుకే అబద్దాలు, అసత్యాల ద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నది. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదు. అబద్ధపు హాల ద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించింది. అయితే వీటికి భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హా బోగస్‌గా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ దిల్లీ, టూ దిల్లీ, ఫర్ దిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. నాలుగేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమని కేటీఆర్ అన్నారు.
అయితే కొత్త ప్రభుత్వానికి ప్రస్తుత సర్కార్ చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనమైందని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులు నుంచి మొదలు వ్యవసాయ రంగం, అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగిత పెరిగిందన్నారు. తెలంగాణ నుంచి అనేక కంపెనీలు వెనక్కి వెళ్లిపోతున్నాయని చెప్పారు. ఈ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వలన జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం అప్పుడప్పుడే సాధ్యం కాదు అన్నారు. కాంగ్రెస్ దళారీ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని కేటీఆర్ ఆరోపించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవడం, పంట కొనుగోళ్లపై ఆయన స్పందించారు. వానాకాలం వరికోతలు సాగుతున్నప్పటికీ.. రైతుబంధు, రైతుభరోసా ఊసే లేదని ఆక్షేపించారు. కనీసం పంట కొనుగోలు చేయడం లేదని.. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలకు చాలాచోట్ల కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిందని పేర్కొన్నారు.
ఈ సీజన్లో 91 లక్షల 28 వేల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి.. అక్టోబర్ 28 వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. ’రైతన్న అంటే ఎంత నిర్లక్ష్యమో చూడండి’ అని వ్యాఖ్యానించారు. దళారులతో కుమ్మక్కైన కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడం లేదని.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మిల్లుల కేటాయింపు జరగలేదని కేటీఆర్ విమర్శించారు. సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక ఐకేపీ కేంద్రాల్లోను కొనుగోలు పక్రియ నిలిచిందన్నారు. కనీసం పండించిన చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదని.. ఫలితంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయ్యిందని పేర్కొన్నారు. ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారని.. అక్టోబర్‌లో నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. అక్టోబర్ 28 నాటికి వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని.. దాన్ని బట్టి రైతన్న అంటే ఎంత నిర్లక్ష్యమో ప్రజలు చూడాలన్నారు. దళారులతో కుమ్మక్కు అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని.. నేటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనేలేదని ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక.. ప్రారంభించిన ఐకేపీ కేంద్రాల్లోను కొనుగోలు పక్రియ నిలిచిందన్నారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం డైవర్షన్ పాలిటిక్స్‌లో బిజిబిజీగా ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని ఆయన అన్నారు. ప్రస్తుత పాలన ఫ్రం దిల్లీ, టూ దిల్లీ, ఫర్ దిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని చెప్పారు. ప్రజలపక్షాన కొట్లాడటమే ప్రస్తుతం తమముందున్న బాధ్యత అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో భారాస తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ‘పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతస్థాయి పాదయాత్ర నిర్వహిస్తానని అన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారు. పార్టీ నేతలపై వేధింపులు,అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మా సోషల్ డియా వారియర్లు అద్భుతంగా పని చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. తాము అధికారంలో ఉన్న పదేండ్లలో ఏనాడూ ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదు. దాదాపు రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురైన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్ధంకాదని, ఈ విషయం తనకు అత్యంత బాధ కలిగిస్తుందన్నారు. నీచమైన రాజకీయాల కోసం తన కుటుంబాన్ని లాగుతున్న ముఖ్యమంత్రి పైన, ఆయన వందిమాగదుల పైన ప్రజల మద్దతుతో పోరాటం చేస్తానని చెప్పారు. చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం పేపర్ ద గొప్పలు చెబుతున్నప్పటికీ అసలైన ఎజెండా అవినీతి మాత్రమే. మూసీ బ్యూటిఫికేషన్‌కి తాము వ్యతిరేకం కాదు