Sunday, May 4, 2025

భారత్ బిఎస్ఎఫ్ జవాన్లకు చిక్కిన పాకిస్తాన్ రేంజర్?

పాకిస్తాన్‌ పరామిలిటరీ రేంజర్‌ అనే వ్యక్తిని రాజస్థాన్ సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ జవానులు అదుపులోకి తీసుకున్నారు. భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్త తలు పెరిగిన సమయంలో ఈ పరిణామం జరిగింది. కొన్ని రోజుల క్రితమే భారత బీఎస్‌ఎఫ్ జవాను పూర్ణమ్ కుమార్ షా పొరపాటుగా సరిహద్దు దాటి పాకిస్తాన్‌ లోకి వెళ్ళిన ఘటన మరచిపోకముందే ఇది చోటుచేసుకుంది.

రాజస్థాన్ సరిహద్దులో పాకిస్తాన్‌ పరామిలిటరీ రేంజర్‌ అదుపులోకి తీసుకున్నట్టు బీఎస్‌ఎఫ్ అధికార వర్గాలు వెల్లడిం చాయి. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా అధికారికంగా తెలియకపోయినా, ఈ ఘటన భారత్‌కిచెందిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమ త్తతను సూచిస్తోంది.

ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత రోజే, పూర్ణమ్ కుమార్ షా అనే బీఎస్‌ఎఫ్ జవాను పంజాబ్ సరిహద్దులో పాకిస్తాన్‌ సైన్యం చేతికి చిక్కాడు. గతంలో ఇలాంటి సంఘటనలు సాధారణంగా ఫ్లాగ్‌ మీటింగ్స్‌ ద్వారా పరి ష్కారం కావడం జరిగింది. కానీ ఈసారి పాక్‌ వర్గాలు గట్టిగా స్పందించకపోవ డంతో, ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.

పాకిస్తాన్‌లోని సోషల్ మీడియా ఖాతాల్లో షా బంధించిన ఫోటోలు పోస్టు కావడం కలకలం రేపింది. తలపై గుడ్డబంధంతో వాహనంలో కూర్చుని ఉన్న దృశ్యాలు, చెట్టు వద్ద నిలబడి ఆయుధాలతో పాటు కనిపించిన దృశ్యాల్ని భారత వర్గాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎఫ్‌ తన సిబ్బందికి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.

సరిహద్దుల్లో పహారాలో ఉన్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పొరపాటుగా కూడా సరిహద్దు దాటకూడదని స్పష్టం చేసింది. సరిహద్దు రైతులకు కూడా జాగ్రత్తగా ఉండాలన్న సూచనలు అందాయి.

ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపిన దాడిలో 26 మంది పౌరులు మరణించడంతో భారత్ తీవ్రంగా స్పందిస్తోం ది. దానికి ప్రతిగా పలు నిర్ణయాలు తీసుకుంది. ఇండస్ వాటర్ ఒప్పందం నిలిపివేత, వీసాల రద్దు, వాణిజ్యానికి బ్రేక్, గగనతల నిషేధం వంటి చర్యలతో పాటు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ప్రధాన మంత్రి మోదీ ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com