రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’. చెర్రీ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న మేకర్స్ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఊరమాస్ లుక్‌లో చరణ్ కనిపించాడు. ఇక ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్‌పై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ‘ఫస్ట్ షాట్’ పేరుతో పెద్ది గ్లింప్స్ ను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు ఈ గ్లింప్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారికి తాజాగా మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ గ్లింప్స్ తాలూకు మిక్సింగ్‌ను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం 11.45 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి ఈ గ్లింప్స్ ఎంత మాస్‌గా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.