Monday, November 18, 2024

జగన్ తీరు పై బుద్దా వెంకన్న ఫైర్

తిరుమల ను స్వార్ద రాజకీయాల కోసం జగన్ వాడటం నీచం
తిరుమల వెళతానన్న జగన్.. నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది
మనం అనుకుంటే కాదు… ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలం
వెంకన్న స్వామి అనుమతి లేదు‌ కాబట్టే జగన్ వెళ్లలేక‌పోయాడు
బైబిల్  ఇంట్లో చదువుకునే  జగన్ కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు
నిబంధనల‌ మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్దాంతం ఎందుకు
నీ ఇంట్లో నీ భార్యని కూడా తిరుమల తీసుకు రాలేవు
సిఎం హోదాలోనే నీఇంట్లో వాళ్లు నీ మాట వినలేదు
ఇప్పుడు టిడిపి పై బురద జల్లాలని చూస్తున్నారు
గతంలో తిరుమల ఆలయ పరిసరాల్లో జగన్ చెప్పులు వేసుకుని తిరిగాడు
ఇప్పుడు నెయ్యి కల్తీ‌ వివాదంలో మీ పాత్ర ఉంది
అందుకే వైవి సుబ్బారెడ్డి ని వెనుకేసుకు వస్తున్నావు
తిరుమల సాక్షి గా తప్పు‌చేయలేదని చెప్పే ధైర్యం ఉందా
ఆ స్వామి ఆశీస్సులు చంద్రబాబు కి ఉన్నాయి
మావోయిస్టు ల దాడి నుంచి వెంకన్న స్వామి చంద్రబాబు ను‌ ఆనాడు కాపాడారు
వైసిపి హయాంలో తిరుమల లో అపవిత్రం జరిగింది
అదే అడిగితే‌ చంద్రబాబు పై విమర్శలు చేస్తావా
నువ్వు తిరుమల రావడం ఆ స్వామికే ఇష్టం లేదు
అందుకే ఆయన నిన్ను రానివ్వకుండా నీకు నువ్వే ఆగేలా చేశాడు
జగన్ జమానాలో అన్ని అవినీతి, అక్రమాలే
ప్రభుత్వం వీటి పై విచారణ చేయడంతో జగన్ లో భయం పట్టుకుంది
అందుకే ఇప్పుడు ప్రతి అంశాన్ని కుల, మతాల వారీగా  వివాదం చేస్తున్నారు
మానవ కులం నీదేంటి..‌మా అందరిదీ మావన‌ కులమే
జగన్ ఇప్పుడు అయినా బుద్ధి తెచ్చుకో.. తీరు మార్చుకో
కలుగులో దాక్కున్న వంశీ, కొడాలి‌నాని లు ఇప్పుడు బయటకి వచ్చారు
మొక్కుబడులు ఉంటే తల నీలాలు ఇస్తారు
ఈ‌విషయం‌ కూడా తెలియకుండా  చంద్రబాబు గుండు కొట్టించుకుంటారా అని‌ జగన్ అడిగాడు
ఆయన ప్రతి యేడాది కోటి రూపాయలు విరాళం ఇస్తారు
నువ్వు ఒక్క రూపాయి అయినా‌ విరాళం ఇచ్చావా
నిన్ను స్వామి‌వారే ఆపారు… నువ్వు రావడం ఆయనకి ఇష్టం లేదు
మొదటి జాబితాలో నీ పేరు లేదని కొంతమంది వాగుతున్నారు
లిస్ట్ లతో నాకు పని లేదు…‌నా గుండెల్లో చంద్రబాబు ఉంటారు
నాకు పదవులు ఇస్తే ఇంకా పని చేస్తా… నేనైతే  పార్టీ కోసం, చంద్రబాబు, లేకేష్  కు భక్తుడిగా ఉంటా

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular