Sunday, February 2, 2025

వివిధ శాఖలకు కేటాయింపులు ఇవీ

రక్షణ రూ. 4,91,732 కోట్లు,
గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు,
హోం రూ. 2,33,211 కోట్లు,
వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు,
విద్య రూ. 1,28,650 కోట్లు,
ఆరోగ్య రూ. 98,311 కోట్లు,
పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు,
ఐటి, టెలికాం రూ. 95,298 కోట్లు,
విద్యుత్‌ రూ. 81,174 కోట్లు,
వాణిజ్య, పరిశ్రమలు రూ. 65,553 కోట్లు,
సామాజిక సంక్షేమం రూ. 60,052కోట్లు,
వైజ్ఞానికి విభాగాలకు రూ. 55,679 కోట్లు

ఆదాయ పన్ను నుంచి 22 శాతం, కేంద్ర ఎక్సైజ్‌ నుంచి 5 శాతం, జిఎస్టి, ఇతర పన్నుల నుంచి 18 శాతం, కార్పొరేషన్‌ పన్ను ద్వారా 17 శాతం కస్టమ్స్‌ ద్వారా… 4 శాతం, అప్పులతో కాని క్యాపిటల్‌ రిసిప్ట్స్‌ ద్వారా 1 శాతం, పన్నేతర ఆదాయం 9 శాతం, అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరుతుందని వివరించారు. వడ్డీ చెల్లింపులకు 20 శాతం,కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం,కీలక సబ్సిడీలకు 6 శాతం,రక్షణ రంగానికి 8 శాతం, రాష్టాల్రకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం, ఫెనాన్స్‌ కమిషన్‌, ఇతర బదిలీల ద్వారా 8 శాతం, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం, ఇతర ఖర్చులకు 8 శాతం, పెన్షన్స్‌లకు 4 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.  దాదాపు 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్దేశిరచే ఈ కేంద్ర పద్దును ఆమె ప్రవేశపెట్టడం ఇది ఎనిమిదోసారి.

తద్వారా ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుద్కెన ఘనత సాధించారు. అత్యధికసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ పేరిట ఉంది. ఆయన 10 పద్దులను పార్లమెంట్‌కు సమర్పించారు. ఆ తర్వాత పి.చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ వంటి వారున్నారు. నిర్మలా సీతారామన్‌ క్రమంగా వారి రికార్డులకు చేరువవుతున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో వరుసగా అత్యధిక బ్జడెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డును నిర్మలమ్మ కొనసాగిస్తున్నారు. ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళామంత్రి గానే కాకుండా.. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది.

2020-21లో బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. అయితే ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలిఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. అంతకంటే ముందు 2019-20 బడ్జెట్లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతిపెద్దది. అంతకుముందు 2003-04బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జశ్వంత్‌సింగ్‌ 135 నిమిషాల పాటు మాట్లాడారు. 2024-25 బడ్జెట్‌ ప్రసంగంలో పెద్ద పద్దును 86 నిమిషాల్లో (1 గంట 26 నిమిషాలు) ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్‌ ప్రసంగాల్లో అదే అతి చిన్నది. కాగా నేడు ప్రవేశపెట్టిన బ్జడెట్‌లో 74 నిమిషాల పాటు ప్రసంగించారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com