Tuesday, December 24, 2024

బడ్జెట్‌లో ఉద్యోగులకు మొండిచేయి

అధికారంలోకి రాగానే అన్నీ చేస్తామన్న మాట తప్పారు:ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపణ. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఉద్యోగులు, పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ప్రెస్‌ మీట్‌.

నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకుండానే బడ్జెట్‌
ఉద్యోగులు, పెన్షనర్లకిచ్చిన హామీలపై నోరు మెదపరే?
2 డీఏలు, పీఆర్సీ బకాయిలు ఎప్పుడిస్తారు?
అసలు బడ్జెట్‌లో నిధులెందుకు కేటాయించలేదు?: సూటిగా ప్రశ్నించిన చంద్రశేఖర్‌రెడ్డి

30 శాతానికి తగ్గకుండా పీఆర్సీ అమలు చేయాలి
తక్షణం ఓల్ట్‌ పెన్షన్‌ స్కీం పథకం అమలు చేయాలి
రూ.25వేల కోట్ల జీపీఎఫ్, ఇతర బకాయిలు ఇవ్వాలి
వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తూ, వారిని కొనసాగించాలి:ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌

తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ ముఖ్యాంశాలు: ఉద్యోగులు, పెన్షనర్లకు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే మొండిచేయి చూపించినట్టే అనిపిస్తుంది.
– ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, జీపీఎఫ్‌ లాంటివి దాదాపు రూ.25 వేల కోట్లు పెండింగ్‌ ఉన్నాయి. వెంటనే అవన్నీ చెల్లించాలి.
– రెండు డీఏ బకాయిలు, జీపీఎఫ్, సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, పీఆర్సీ బకాయిల వంటివి ఉద్కోగులు, పెన్షనర్స్‌కు రావాల్సి ఉంది. వాటిని కూటమి ప్రభుత్వం తక్షణం అమలు చేయాలి.
– జూన్‌ 1, 2023 నుంచి రావాల్సిన పీఆర్సీని 30 శాతం తగ్గకుండా అమలు చేయాలి.
– దసరా, దీపావళి సందర్భంగా డీఏ లేదా ఐఆర్‌ వస్తుందని ఉద్యోగులు ఎదురు చూశారు. కానీ నెరవేరలేదు. వైఎస్‌ జగన్‌ హయాంలో మధ్యంతర భృతి 27 శాతం అమలు చేశారు.
– అందుకే కూటమి నాయకులు కూడా మాట నిలబెట్టుకుంటూ, 27 శాతం తగ్గకుండా ఐఆర్‌ ఇవ్వాలి.
– పెన్షనర్స్‌ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దాని గురించి ఇంతవరకు ప్రభుత్వం మాట్లాడటం లేదు.
– ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన హామీని తక్షణం అమలు చేయాలి.
– హామీ ఇచ్చినట్టుగానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీదనే ఉంది. లక్ష మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డుపాలు కాకుండా కాపాడాలి.

డిమాండ్లు:
– అర్హులైన ఉద్యోగులకు పదోన్నతలు కల్పించడంతోపాటు చాలా శాఖల్లో ఖాళీలను తక్షణం భర్తీ చేయాలి.
– డిసెంబర్‌ లోపు భర్తీ చేస్తామన్న డీఎస్సీ విషయంలో మాట మార్చారు. షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి.
– ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారు పని చేస్తున్న ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి.
– రాష్ట్రంలో 3.80 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మంజూరు చేయాలి.
– ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో బేసిక్‌ మీద 40 శాతం కమిటేషన్‌ చేస్తారు. కమిటేషన్‌ చేసిన తర్వాత 15 ఏళ్ల నుంచి ఫుల్‌ పెన్షన్‌ వస్తోంది. దాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించాలి.
– సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులను ఓపీఎస్‌లోకి తీసుకు రావాలని డిమాండ్‌ చేస్తున్నాం.
– ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) కార్డుపై కొన్ని ఆస్పత్రుల్లో కొన్ని జబ్బులకు వైద్యం చేయడం లేదు. అన్ని జబ్బులకు ఈహెచ్‌ఎస్‌ కార్డు మీద వైద్యం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను.
– వలంటీర్లకు హామీ ఇచ్చినట్టుగా వారికిచ్చే గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచి వారి సేవలను పునరుద్ధరించాలి.
– ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, జీతాలు పెంచాలి.
– ఆప్కాస్‌లో లేని ఉద్యోగులకు జీతాలు ఆరు నెలలుగా అందడం లేదు. వారికి తక్షణం జీతాలు చెల్లించాలి.
– గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలైంది. 10,700 మందిని గుర్తించి, వారిలో 4వేల మందిని రెగ్యులరైజ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌తో అది ఆగిపోయింది. మిగిలిన వారందరి సర్వీస్‌ క్రమబద్ధీకరించాలి.
– కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పెరిగిన పని ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించాలి.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com