Saturday, February 8, 2025

హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు సౌత్‌ సెంట్రల్‌కు డీపీఆర్‌

దేశంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు హైదరాబాద్ వరకు విస్తరించబోతుంది. దేశంలోని పలు కీలక నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగంగా.. హైదరాబాద్‌లోనూ బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. ఈ బుల్లెట్ రైలు నిర్మాణం పూర్తి అయితే.. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలకు మరింత వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రాబోతుంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఈ కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ బుల్లెట్ రైలు కారిడార్‌ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించాలని నిర్ణయించిన హైస్పీడ్ రైలు కారిడార్‌ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఈ ప్రాజెక్టు ప్రాథమిక డీపీఆర్‌ను సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జోన్‌కు పంపించింది.
ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే.. కేవలం రెండు గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే..
హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు మధ్య ప్రయాణ దూరం బాగా తగ్గబోతుంది. ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గాన్ని ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. జపాన్ సంస్థ టెక్నాలజీ, ఆర్థిక సాయంతో ఈ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను రైల్వే శాఖ నిర్మిస్తున్నారు. ఈ ముంబై-అహ్మదాబాద్ మార్గంలో జపాన్ తయారు చేసిన బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది.

హైస్పీడ్ రైల్ కారిడార్లు
ఆ తర్వాతి దశలో మరిన్ని హైస్పీడ్ రైల్ కారిడార్లను దేశంలో నిర్మించేందుకు రైల్వే శాఖ తీవ్ర కసరత్తులు మొదలు పెట్టింది. ఇందులో హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్, అండర్‌గ్రౌండ్ మార్గాల్లో నిర్మించనున్నట్లు సమాచారం. హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్య దూరం 618 కిలోమీటర్లు కాగా.. సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణిస్తే ప్రయాణ సమయం 11 గంటలు ఉంటుంది. అదే వందే భారత్‌ రైలులో వెళ్తే ఎనిమిదిన్నర గంటల్లో చేరుకోవచ్చు. కానీ.. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకునే వెసులుబాటు లభిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అలాగే హైదరాబాద్-చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు కాగా.. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అయితే 15 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం రెండున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి చెన్నైకి చేరుకోవచ్చు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com