Tuesday, April 22, 2025

బంపర్ ఆఫర్.. కేవలం 2 రూపాలకే చికెన్ బిర్యానీ

  • బంపర్ ఆఫర్.. కేవలం 2 రూపాలకే చికెన్ బిర్యానీ
  • ఎగబడిని జనానికి చివర్లో ట్విస్ట్ ఇచ్చిన రిస్టారెంట్ 

సాధారణంగా ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే ముందు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటించడం సర్వ సాధారణం. ఐతే ఇలా ఇచ్చే ఆఫర్లలో కొంత మర్మం ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు. పేపర్ లోనో, టీవీలోనో ఆఫర్ గురించి తెలుసుకుని ఏ మాత్రం అలస్యం చేయకుండా షాప్కు వెళ్లిపోతారు. తీరా అక్కడికి వెళ్లాక ఆఫర్ లో ఉండే నిబంధనలు తెలిశాక ఉస్సూరుమంటుంటారు.

ఇదిగో ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవం సందర్బంగా అచ్చు ఇలాగే జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ రెస్టారెంట్‌ ప్రారంభం సందర్భంగా దాని ఓనర్‌ బిర్యానీకి సంబంధించి ఓ సూపర్ డూపర్ ఆఫర్‌ ప్రకటించాడు. కేవలం రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ  అంటూ రెండు మూడు రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తునప్రచారం నిర్వహించాడు. చుట్టు పక్కల ప్రాంతాలన్నింటిలో 2 రూపాయలకే రుచికరమైన చికెన్  బిర్యానీ అని ఫ్లెక్సీలు పెట్టించాడు.

ఇంకే ముంది రెండు రూపాలకే చికెన్ బిర్యాని అనే సరిది జనం సదరు హోటల్ కు బారులు కట్టారు. హోటల్ ప్రారంభోత్సవం రోజు సుమారు రెండు వేల మంది బిర్యానీ తినేందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో వారిని అదుపు చేయడం ఓనర్ కు సిబ్బందికి కష్టతరంగా మారింది. కొంత సేపు అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఐతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. కేవలం మొదట వచ్చిన 200 మందికి మాత్రమే 2 రూపాయల బిర్యానీ ఆఫర్ అని, ఆ తరువాత వచ్చిన వారందరిని మామూలు ధరే అని చావు కబురు చల్లగా చెప్పాడు ఓనర్. దీంతో ఇదేం ట్విస్ట్ గా బాబు ఇని రిస్టారెంట్ ఓనర్ తిట్టుకుంటూ వెళ్లిపోయారట కస్టమర్లు. ఆ విషయమేదో ముందే చెబితే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు కదా అని వాపోయారు చాలా మంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com