Tuesday, May 6, 2025

బన్నీ పేరు మార్చుకుంటున్నాడా…?

గంగోత్రి టు పుష్ప-2 వరకు టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. పుష్ప సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఓ ఊపు ఊపేశారు. నెవ్వర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేశారు ఈ ఐకాన్‌ స్టార్‌. రీసెంట్ గా పుష్ప సీక్వెల్ తో రూ.1800 కోట్ల హిట్ కొట్టి ఎన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకున్నారు. అలా కెరీర్ లో పీక్స్ స్టేజ్ లో ఉన్నారు బన్నీ. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరిన్ని భారీ ప్రాజెక్టులను కూడా లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక సినీ ఇండస్ట్రీ హీరోలు.. హీరోయిన్లకి ముహూర్తాలు.. జాతకాలు.. న్యూమరాలజీ లాంటివి బాగా నమ్ముతారన్న విషయం అందరికీ తెలిసిందే. కొంతమంది తమ పేరులో కొన్ని లెటర్స్‌ను కొత్తగా చేర్చుకోవడం.. మరికొంతమంది ఏకంగా పేరునే మార్చుకోవడం లాంటివి చేస్తుంటారు. మరి ఇప్పుడు బన్నీ కూడా తన పేరులోని కొన్ని అక్షరాలని మార్చాలనుకుంటున్నారు. నేమ్ కు ఎక్స్‌ట్రా U లు లేదా N లు యాడ్ చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అది నిజమేనా లేక రూమరా అన్నది తెలియాల్సి ఉంది. అయితే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు నేమ్స్ కు క్స్‌ట్రా లెటెర్స్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే కొందరు సెలబ్స్ తమ నేమ్స్ కు ఎక్స్‌ట్రా లెటర్స్ ను యాడ్ చేశారు. హీరో నితిన్.. తన కెరీర్ స్టార్టింగ్ లో ఇంగ్లీష్ నేమ్ లో మార్పులు చేసుకున్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా తన పేరుకు కొన్ని అక్షరాలు జోడించారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా అలాంటి మార్పులు చేసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా స్క్రీన్ నేమ్ నే మార్చుకున్నారు. రీసెంట్ గా తన తల్లి పేరును యాడ్ చేసి.. సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నారు. ఆ విషయాన్ని ఆయనే అనౌన్స్ చేశారు. అయితే ఇలాంటి మార్పులు.. వాళ్లకు సక్సెస్ తెచ్చాయో లేదా అనేది తర్వాత విషయం. కానీ ఆ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్.. నేమ్ లో ఛేంజెస్ చేస్తే.. తన జర్నీలో మరో ఛాప్టర్ స్టార్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇంతకీ ఇప్పుడు మార్పు దేనికో అన్న ప్రశ్నలు కూడా వెల్లడవుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com