ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లుఅర్జున్ ‘పుష్ప’ చిత్రంతో భారీ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఓ గుర్తింపును అందుకున్నారు. ఎక్కడ చూసినా పుష్పరాజ్ మేనియానే. ఇకపోతే అల్లుఅర్జున్ ఈ సినిమా తరువాత ఎవరి డైరెక్షన్‌లో నెక్ట్స్ రాబోతున్నారు అన్న వార్తలు రాగా. ప్రస్తుతం ఈయన అట్లీతో లాక్ అయ్యారన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీన అల్లుఅర్జున్, అట్లీ కాంబో గురించి అనైన్స్‌మెంట్ వచ్చింది.
ఈ చిత్రం కోసం కేవలం వీఎఫ్‌ఎక్స్ కోసమే రూ.250కోట్లు వెచ్చిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో 170కోట్లు అల్లుఅర్జున్‌కే రెమ్యూనరేషన్‌గా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పుడు అల్లుఅర్జున్ పక్కన హీరోయిన్ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. జాన్వీకపూర్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తోందని కొన్ని రోజులు వార్తలు వచ్చాయి. మరోవైపు ప్రియాంకచోప్రా కూడా ఇందులో నటించబోతోంది అంటూ వార్తలు గుప్పించాయి. కానీ అంతోనే సంయుక్త మీనన్ ఎంటర్ అయింది. ఇక వీరితో పాటు సమంత కూడా నటించబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా అన్యన్య పాండేని ఓకే చేశారనే వార్త వినిపిస్తోంది. ఏది ఏమైనా మేకర్స్ ఈ విషయం పై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.