తెలంగాణలో బస్సుసీటు కోసం మహిళలు జుట్లుపట్టుకుని బాదుకున్నారు. ఈ ఘటన మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం మంథనిలోని కాళేశ్వరం దేవస్థానం బస్టాండ్‌లో జరిగింది. బస్సులు లేక కొందరు ఇబ్బందిపడితే.. వచ్చిన ఒక్కబస్సులో సీట్‌కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.
పంతానికి దిగితే మహిళలు ఎంతకైనా తెగిస్తారు అనే దానికి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోనే నిదర్శనం. బస్సులో సీటు కోసం ఏకంగా నడిరోడ్డుపైనే జుట్లు పట్టుకుని మహిళలు బాదుకున్నారు. ఎవరు ఆపినా.. ఆగకుండా జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. అయితే ఇదంతా ఎక్కడో కాదు.. తెలంగాణలోనే జరిగింది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సుల పథకాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఎలాంటి టికెట్ లేకుండా జర్నీ చేసేందుకు మహిళలకు అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ పథకం అమలు జరిగినప్పటి నుంచి బస్సులో ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంది.
సీట్ల కోసం జుట్లు పట్టుకుని
సీట్ల కోసం మహిళలు ఘోరాతి ఘోరంగా దాడులు చేసుకుంటున్నారు. ఆపుదామని అడ్డుచ్చిన వారిని సైతం పక్కకు నెట్టి జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలానే అలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి. సీటు కోసం బస్సులోనే బాదుకున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.