Friday, April 18, 2025

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం

మరో యువగళం హామీని నెరవేర్చిన మంత్రి నారా లోకేష్

అమరావతి: యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ ఇచ్చిన హామీలు ఒక్కొకటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చాక దేశం కోసం సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీ నెరవేరుస్తూ బుధవారం నాటి క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం యువగళం హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు మంత్రి లోకేష్ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు నెరవేర్చాల్సిన హామీలపై ఇప్పటికే ఆయా శాఖల మంత్రులతో చర్చిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా కొంచెం సమయం పట్టినా యువగళంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని లోకేష్ స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com