రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారు చేశారు. జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి హాజరుకావాలని మంత్రులకు మంగళవారం సమాచారం పంపించారు. కొత్త రేషన్ కార్డులు,రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి రూ. 12000 సహాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం ఉంది. నిజానికి, ఈ నెల 30న కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో వాయిదా పడింది.