మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్, మళయాళ స్టార్ మోహన్ లాల్ ఇలా అందరు భాగమయ్యారు. ఐతే కన్నప్ప సినిమా మొదటి టీజర్ సినిమాపై కాస్త నెగిటివిటీ తీసుకు రాగా తర్వాత వచ్చిన సాంగ్ ఇంకా రెండో టీజర్ ఇవన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలో ప్రభాస్ చేస్తున్న రుద్ర రోల్ పై రెబల్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఐతే సినిమాలో ప్రభాస్ ది క్యామియో రోల్ అనుకున్నారు కానీ అలా కాదని లేటెస్ట్ టాక్. ప్రభాస్ పాత్ర ముందు ఒక చిన్న సీన్ లాగా రాసుకున్నా కన్నప్పలో ప్రభాస్ ఉన్నాడని తెలిసే సరికి సినిమాపై ఒక రేంజ్ బజ్ ఏర్పడింది. అందుకే ప్రభాస్ తో అనుకున్న సీన్స్ పెంచారట. ఈ సినిమా చేసినందుకు ప్రభాస్ ఒక్క రూపాయ్ రెమ్యునరేషన్ గా తీసుకోలేదని విష్ణు చెప్పాడు. సో ఫ్రెండ్ కోసం ఫ్రీగానే కన్నప్ప సినిమాలో భాగం అయ్యాడు ప్రభాస్. అంతేకాదు ఈ సినిమాకు అడ్డు రాకూడదని రాజా సాబ్ సినిమాను కూడా గ్యాప్ తో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ క్యామియో రోల్ తో వస్తున్న కన్నప్ప రెబల్ స్టార్ క్యామియోలా కాకుండా ఇంపార్టెంట్ రోల్ లానే ప్లాన్ చేశారట. సో ఈ మాత్రం హింట్ ఇస్తే ఇక రెబల్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అంతేకాదు సినిమాలో ఏ యాస్పెక్ట్స్ ఎలా ఉన్నా ప్రభాస్ రుద్ర రోల్ క్లిక్ అయితే మాత్రం సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని తెలుస్తుంది. అసలైతే ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.