Thursday, June 5, 2025

కేమియో పాత్రని నేను చేయాల్సింది కాదు కానీ…

ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. గౌతమ్ మీనన్ నాకు మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆయన తల్చుకుంటే ఆ టైంలో ఏ టాప్ హీరోయిన్‌ అయినా నటించేవారు. కానీ ఆయన నాలాంటి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. నేను కూడా నిర్మాతగా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతోనే ఉన్నాను. నటిగా ఉన్నప్పుడు నిర్మాత కష్టాలేవీ నాకు అర్థం కాలేదు. ఒక్క రోజు ఒక్క సీన్ అనుకున్నట్టుగా జరగకపోతే ఎంత నష్టం వస్తుంది.. డబ్బు ఎంత వృథా అవుతుందో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఎంతో మంది టైం వేస్ట్ అవుతుందని అర్థమైంది. ‘శుభం’ చిత్రంలోని కేమియో పాత్రని నేను చేయాల్సింది కాదు. కానీ నిర్మాతగా మొదటి సారిగా నేను ఎవరి దగ్గరకు వెళ్లి ఫేవర్ అడగాలని అనుకోలేదు. అందుకే ఆ పాత్రను నేనే పోషించాను. నేను ఈ మూవీని ఇంకో మూడు, నాలుగు రోజులు మాత్రమే ప్రమోట్ చేయగలను. కానీ ఆ తరువాత ఈ మూవీ భారమంతా ప్రేక్షకుల మీదే ఉంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com