Monday, March 10, 2025

ధరణి పోర్టల్‌ ‌రద్దు..

ఈ నెలాఖ‌రులోగా కొత్త చట్టం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి వెల్లడి

‌ధరణి పోర్టల్‌ ‌ను రద్దు చేసి త్వరలో ఆర్‌వోఆర్‌ ‌చట్టం తీసుకు వస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామ‌ని, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామ‌ని,  గత ప్రభుత్వం డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్స్ ‌ను గాలికి వొదిలేసింద‌ని,  పూర్త‌యిన‌ ఇండ్లను దసరా లోపు పేద ప్రజలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఇక, వెంటనే మరమ్మతులు మౌలిక వసతులు కల్పిస్తాం.. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4 వేల ఇండ్లు మంజూరు.. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామని పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి తెలిపారు.

ఈనెల 7న ప్రజా ప్రభుత్వం ఏర్పాడి 10 నెలలు పూర్తవుతుంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి తెలిపారు. 10 నెలల్లో ప్రజలు కోరుకున్న వాటిని సాధించలేక పోయాం.. రాబోయే రోజుల్లో తెల్ల రేషన్‌ ‌కార్డు సహా అన్ని పథకాలకు స్మార్ట్ ‌కార్డుతో అనుసంధానం చేస్తాం.. ఈ దసరాలోపు స్మార్ట్ ‌కార్డులు ఇస్తాం.. అర్హతలను బట్టి స్మార్ట్ ‌కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం.. రాబోయే నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన ప్రతి పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు.

జనవరి నుంచి ఆసరా పెన్షన్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తాం.. రుణ మాఫీ కానీ రైతులకు రూ.13 వేల కోట్లతో త్వరలో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాలు సొల్లు మాటలు మాట్లాడుతున్నారు.. 10 ఏళ్లలో బీఆర్‌ఎస్‌ ‌రైతులకు ఇచ్చింది 15 వేల కోట్లు మాత్రమే.. ప్రతిపక్ష పార్టీలు పోరంబోకు మాటలు మాట్లాడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి మండిపడ్డారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com