Saturday, April 5, 2025

మీకు ఇంకా రుణమాఫీ కాలేదా? ఐతే ఇలా చేయండి

తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన 2 లక్షల రైతు రుణమాఫీ పథకం ఇంకా చాలా మంది రైతులకు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబందించిన డబ్బులు జమ చేసింది రేవంత్ సర్కార్. గత నెల జులై 18న మొదటి విడతలో లక్ష రూపాయల లోపు, జులై 31న రెండవ విడతలో లక్షా 50 వేల రూపాయల లోపు, ఇక ఆగస్టు 31న మూడవ విడతలో లక్షన్నర నుంచి 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలకు సంబందించిన డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఐతే రాష్ట్రంలో చాలా మంది రైతులు రుణమాఫీకి అర్హులైనప్పటికీ వారికి రుణమాఫీ అమలు కాలేదు. కొంత సమాచార లోపం, కొన్ని సాంకేతిక సమస్యల వంటి 31 కారణంగా రుణమాఫీ డబ్బులు కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేశారు.

రైతు రుణమాఫీ పధకానికి అర్హత ఉండి, ఇంకా రైతు రుణమాఫీ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమిస్తున్నామని వ్యవసాయశాఖ ప్రకటించింది. రైతులు తమ ఆధార్‌ కార్డులోని సమాచారం, సంబంధిత బ్యాంకు వద్ద నమోదైన డేటాలో చిన్నచిన్న తప్పులు, రైతు పట్టాదారు పాస్‌పుస్తకాల సమస్యలు, పేరు సరిగా లేకపోవడం వంటి ఫిర్యాదులను ఆయా మండలాల్లోని నోడల్‌ అధికారికి అందజేయాలని సూచించారు అధికారులు. ఈనెల 21 మంగళవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవ్వగా మండల వ్యవసాయాధికారి కార్యాలయాలతో పాటు రైతు వేదికల్లోను రైతు రుణమాఫీకి సంబందించిన ఫిర్యాదుల స్వీకరిస్తున్నారు. ఆయా పిర్యాదులను పరిశీలించి వెను వెంటనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులును జమచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే రైతులు ఎవరూ ఆంధోళన చెందవద్దని, అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. మరోవైపు రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ పంట రుణం ఉన్న రైతులకు సైతం రుణాలను మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే విధివిధానాలను ప్రకటించనుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com