రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఒకేసారి రూ. లక్ష రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని గత ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా పక్షపాత ధోరణితో వ్యవహారిస్తూ ఆ పార్టీ నాయకులకే ఇచ్చేవారన్నారు. బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్, రెజిమెంటల్ బజార్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.