భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయి గూడెంలో విషాదం చోటుచేసుకుంది. కార్ డోర్స్ ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. మడకం సాయి, లిఖిత దంపతుల కుమార్తె కల్నిష… ఇంటి ఆవరణలో ఆడుకుంటూ… కారులోకి ఎక్కింది. కాసేపటికి కారు డోర్స్ ఆటోమెటిక్‌గా లాక్ కావడంతో అందులోనే చిన్నారి కల్నిష ఉండిపోయింది. చిన్నారి కనిపించడం లేదని వెతుకుతున్న తల్లిదండ్రులు కారులో పడి ఉన్న చిన్నారిని చూసి అద్దాలు పగలగొట్టారు. చిన్నారిని బయటకు తీసుకురాగా అప్పటికే చనిపోయింది.