Monday, May 12, 2025

కారు షురూ… రంగం సిద్ధం

గత ఎన్నికల పరాజయం తరువాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి అసెంబ్లీకి కూడా ఆయన రావడం లేదు. అలాంటిది బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా కారు నడిపారు. కేసీఆర్‌ కొన్ని నెలలుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్‌ హౌజ్‌ లోనే ఉన్నారు. తనను కలవాలనుకునే పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులను అక్కడికే పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన ఫామ్‌ హౌజ్‌ లో కారు నడుపుతూ కనిపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల చిహ్నం కూడా కారు కావడం విశేషం.
ఇక లేటెందుకు ‘కారు’దే జోరు అంటూ సోషల్‌ మీడియాలో తెగ కామెంట్లు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గడం, లోక్‌ సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినడంతో … బీఆర్‌ఎస్‌ పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. ఈ క్రమంలో త్వరలోనే కేసీఆర్‌ తెరపైకి వస్తారని ప్రచారం జరుగుతోంది. దానికి ఈ కారు నడిపిన వీడియోతో మరింత ఉత్సాహం వచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com