Wednesday, November 6, 2024

Case Filed On Namasthe Telangana Managing Editor నమస్తే తెలంగాణ మేనేజింగ్ ఎడిటర్ దామోదర్ పై కేసు నమోదు.

హైదరాబాద్: మీర్ పెట్ పోలీస్ స్టేషన్ లో ఆరు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. నమస్తే తెలంగాణ పేపర్ లో తప్పుడు వార్త రాసి తమకు నష్టం కలిగించేలా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన గుర్రం గూడా రైతులు. నాదూర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 92 లో ఉన్న భూమికి సంబంధించి తప్పుడు కథనాలు రాసారని రైతుల ఫిర్యాదు.

బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పోలింగ్ అంటూ తప్పుడు కథనం ప్రచురించారని ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు. తమ భూములను డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు అంగీకరించమని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నమస్తే తెలంగాణ పేపర్ లో ప్రచురించారని రైతుల ఫిర్యాదు.

ఎకరానికి 1000 స్క్వేర్ యాడ్లు తోపాటు 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చారని ఫేక్ వార్త ప్రచురించిన నమస్తే తెలంగాణ. దీనికి ఒప్పుకుని రైతులు ప్రైవేట్ వ్యక్తులకు డెవలప్మెంట్ కోసం ఇవ్వడానికి రైతులు అంగీకరించారని అక్టోబర్ 31న నమస్తే తెలంగాణలో ఆర్టికల్.తమ భూములను అమ్ముకునేందుకు NOC లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులు.

ఈ తరుణంలో నమస్తే తెలంగాణలో ప్రైవేటు వ్యక్తులకు రైతులు భూమి అమ్మినట్టు వచ్చిన వార్తతో తమకు తీవ్ర నష్టం కలిగించారని వాపోతున్న రైతులు. వార్త ప్రచురించిన నమస్తే తెలంగాణ మేనేజింగ్ ఎడిటర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు. రైతుల ఫిర్యాదు మేరకు నమస్తే తెలంగాణ మేనేజింగ్ ఎడిటర్ దామోదర్ పై బిఎన్ఎస్ 319 (2), 338, 340(2), 353(2), 61 (2)(a) r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కాప్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular