Thursday, December 12, 2024

Pushpa2 controvercy వివాదాల పుష్ప… ఢిల్లీకి చేరిన ఫిర్యాదు

  • పుష్పగాడి దెబ్బకు బెనిఫిట్​ షోలు రద్దు
  • ప్రకటించిన మంత్రి వెంకట్​ రెడ్డి
  • అల్లు అర్జున్​ను అరెస్ట్​ చేయాలని మరో ఫిర్యాదు

పుష్ప –2 సినిమా మొత్తం వివాదాల చుట్టూ తిరుగుతున్నది. ఈ సినిమా విడుదల పుణ్యమాని.. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్​షోలకు బ్రేక్​పడింది. బెనిఫిట్​ షోలకు అనుమతి ఇవ్వమంటూ సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్​రెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు అందింది. ఇప్పటికే అల్లు అర్జున్​పై కేసు నమోదు కాగా.. ఆయన్ను అరెస్ట్​ చేయాలంటూ వికారాబాద్​ ఎస్పీకి మరో పిటిషన్​ అందింది.

చుట్టూరా వివాదాలు
పుష్ప -2 విడుదల వేళ చోటు చేసుకున్న ఘటనల పైన వరుస ఫిర్యాదులు నమోదు అవుతు న్నాయి. పుష్ఫ -2 విడుదల సమయం నుంచి అల్లు అర్జున్ టీం సంబురాలు ఎలా ఉన్నా.. వివాదాలు మాత్రం పెరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ షో వేళ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ పేరు చేర్చారు. ఈ ఘటన పైన మూవీ మేకర్స్ మైత్రి సంస్థ స్పందించింది. ఇప్పుడు ఈ అంశం ఢిల్లీకి చేరింది. దీంతో, ఇప్పుడు మూవీ మేకర్స్.. అల్లు అర్జున్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది.

పుష్ప– -2 ప్రీమియర్ షో వేళ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని ధియేటర్ పైన ఇప్పటికే కేసు నమోదైంది. కాగా, పోలీసులు సైతం ధియేటర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తేల్చారు. ప్రముఖులు ధియేటర్ కు వస్తున్నట్లు ముందస్తు సమచారం లేదని చెప్పారు. దీంతో, ధియేటర్ తో పాటుగా అల్లు అర్జున్, వ్యక్తిగత సిబ్బంది పైనా కేసు నమోదు చేశారు.

బెనిఫిట్​ షోలు రద్దు
పుష్ప సినిమా బెనిఫిట్​ షో తెలుగు చిత్ర పరిశ్రమకు మరో బ్రేక్​ ఇచ్చింది. ఒకరి మృతి మృతి కారణమైన బెనిఫిట్‌ షోలు రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని మంత్రి వెంకట్​రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో పుష్ప 2 బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో బాలుడు చావుతో పోరాడుతున్నారు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇకపై ఏసినిమాకి కూడా బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిపిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు.

అయితే, భారీగా జనం వస్తారని తెలిసి కూడా థియేటర్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణ ఉంది. అన్నింటినీ బేరేజు వేసుకున్న ప్రభుత్వం ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్‌ షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆనందంతో సినిమా చూసేందుకు వచ్చిన ఫ్యామిలీ విషాదంతో ఇంటికి వెళ్లడం ఆందోళన కలిగించిందని అన్నారు కోమటి రెడ్డి. బెనిఫిట్‌షోలు కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అందుకే ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్‌ షోకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్టు తెలిపారు.

ఇక, ఈ తొక్కిసలాటకు పోలీసులు, అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యమే కారమణని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఇంత జనం ఉన్న టైంలో అల్లు అర్జున్ ఎలాంటి అనుమతి లేకుండా థియేటర్‌లోకి ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు వివరించి ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా పట్టించుకోలేదని అంటున్నారు. ఈ తొక్కిసలాట సమయంలో అక్కడే ఉన్న విజయ్ అనే యువకుడు చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన వాపోతున్నాడు. రాత్రి 9 గంటలకే భారీగా జనం వచ్చారని ఆ పరిసరాల్లో పూర్తిగా బ్లాక్ అయ్యాయని తెలిపారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు కానీ, ఇటు థియేటర్ సిబ్బంది కూడా లేరని వివరించారు.

పరిస్థితి అప్పటికే ఊపిరాడకుండా ఉందని అంతలోనే అల్ల అర్జున్ అక్కడకు రావడంతో సిఛ్యుయేషన్ పూర్తిగా కంట్రోల్ తప్పిందని విజయ్‌ వివరించారు. తర్వాత అక్కడకు వచ్చిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం ప్రారంభించారని అన్నారు. క్రిమినల్స్‌ను కొట్టినట్టు కొట్టారని వివరించారు. వాటిని పట్టించుకోకుండా జనం మధ్య నుంచి వెళ్తున్న అల్లు అర్జున్ వాహనాన్ని అభిమానులు వెంబడించారన్నారు. ఇదే తొక్కిసలాటకు కారణమైందన్నారు. ముందే మేల్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. సరైన భాద్రతా ఏర్పాట్లు చేయనందు వల్లే ఒకరి ప్రాణం పోయిందని మరో బాలుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ల వద్ద ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుండటంతో మరోవైపు బెనిఫిట్ షో రేట్ల విషయంలో వస్తున్న ఆరోపణలు కూడా ప్రభుత్వానికి చికాకు పెట్టిస్తన్నాయి. అందుకే ప్రభుత్వం బెనిఫిట్‌షోలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చింది.

ఢిల్లీకి చేరిన పంచాయితీ
ఇదే ఘటన పైన తాజాగా జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరించింది. మృతురాలి కుటుంబా నికి రూ.5 కోట్లు పరిహారం ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే తొక్కిసలాటలో ఓ మహిళ చనిపో యిందని ఫిర్యాదులో వివరించారు. థియేటర్ లో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ రావటంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో రేవతి (35) అనే మహిళ తొక్కిసలాటలో మరణించారని, పిటిషన్​లో పేర్కొన్నారు.

Allu Arju అర్జున్​ను అరెస్ట్​ చేయండి
సినిమాకు వచ్చి ప్రాణాలు తీసుకున్నా హీరో అల్లు అర్జున్​కు మానవత్వం లేదని, ఆయన్ను అరెస్ట్​ చేయాలంటూ వికారాబాద్​ ఎస్పీకి మరో ఫిర్యాదు అందింది. గతంలో బిగ్​బాస్​ షోలో విజయం సాధించి పల్లవి ప్రశాంత్​కు ఒక న్యాయం, ఇప్పుడు అల్లు అర్జున్​కు ఒక న్యాయంగా ఉందని పిటిషన్​లో పేర్కొన్నారు. వెంటనే అల్లు అర్జున్​ను అరెస్ట్​చేయాలంటూ ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్క జడ్సన్​ ఫిర్యాదు చేశారు.

అల్రెడీ కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జరిగిన ఘటనపై చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో బీఎన్ఎస్ యాక్టీవ్​లోని 105 ,118(1), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద అల్లు అర్జున్​తోపాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు హీరో అల్లు అర్జున్​కు నోటీసులు జారీ చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. అల్లు అర్జున్​తో పాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ మీడియాకు వెల్లడించారు.

బుధవారం పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా RTC Cross Road Sandhya Theatreఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్​లో తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకారమని డీసీపీ పేర్కొన్నారు. బుధవారం రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షోను సంధ్య థియేటర్ యజమాన్యం ఏర్పాట్లు చేశారని తెలిపారు. హీరో అల్లు అర్జున్ వస్తున్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివచ్చారని, ప్రేక్షకులను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించినా సఫలం కాలేదని వివరించారు. సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ రావడంతో పరిస్థితి అదుపు తప్పిందని, ఆయన వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివచ్చారని చెప్పారు ప్రేక్షకులతోపాటు సినిమాలో నటించిన కీలక నటులు ప్రీమియర్ షోకు హాజరవుతారన్న సమాచారం పోలీసులకు రాలేదని డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ చెప్పారు.

థియేటర్ యాజమాన్యం కూడా ఇలాంటి ముందస్తు భద్రత చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఎంట్రీ ఎగ్జిట్​లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని, నటీనటులకు కూడా ఎటువంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదని వివరించారు. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడంతో పరిస్థితి అదుపు తప్పిందని, అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులు కిక్కిరిసి ఉన్నారని తెలిపారు. థియేటర్​లోని లోయర్ బాల్కనీలోకి అల్లు అర్జున్ లోపలికి వెళ్లారని, ఆ క్రమంలో ప్రేక్షకులకు మధ్య తోపులాట చోటు చేసుకుందని డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో దిల్​సుఖ్​నగర్​కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఉన్నారని, అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరాడలేదని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేశారని, కానీ అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారని డీసీపీ చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular