“ ఏ కులమూ నీదంటే ‘గో’కులము నవ్వింది.. మాధవుడు, మానవుడు నాకులేలెమ్మంది..” ఓ మహాకవి రాసిన అద్భుత వ్యాక్యం ఇది. ఏ కులం నీదని అడిగితే గోకులము నవ్వింది.. దీనిలో నిగూఢార్ధం కూడా ఉంది. గోకులం అంటే కృష్ణుని ఊరు మాత్రమే కాదు గో అంటే ఆవు (పశువు) కులం నవ్వింది.. అంటే కులం అడిగితే పశుకులం కూడా నవ్వి.. దేవుడు, మానవుడు (మనిషి) మా కులమే అని అర్థం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సినిమాల్లో కులాల ప్రస్తావన కీలకమవుతుంది. కులాల చుట్టే కథను నడిపిస్తున్నారు.
సినిమాల్లో కులాల కథలు ఇప్పడేమీ మొదలు కాలేదు. బ్లాక్ అండ్ వైట్ తెరపైనే నుంచి ఉన్నాయి. 1938లో ‘మాల పిల్ల’ సినిమాకు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించారు, ఈ చిత్రం నీటి వినియోగం మరియు ఆలయ ప్రవేశంపై బ్రాహ్మణులు మరియు దళితుల మధ్య గ్రామంలో ఉద్రిక్తతలతో వ్యవహరిస్తుంది. అయితే, తర్వాత ప్రధాన పాత్రధారుల మధ్య సంబంధం, ఒక మాల స్త్రీ మరియు ఒక బ్రాహ్మణ పురుషుడు ఇద్దరూ కలిసి పారిపోయారు, ఇది వర్గాల మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తుంది. అయితే, చివరికి, దళితులు ప్రధాన పూజారి భార్యను అగ్ని ప్రమాదం నుండి రక్షించడంతో శాంతి భావం ఏర్పడుతుంది. దీని తరువాత ప్రధాన పూజారి తన హృదయాన్ని మార్చుకున్నాడు మరియు మాల (షెడ్యూల్డ్ కులం) మహిళతో తన కొడుకు వివాహాన్ని ఆమోదించాడు మరియు వారి గ్రామ దేవాలయంలోకి దళితుల ప్రవేశంతో చిత్రం ముగుస్తుంది.
ఆ తర్వాత వచ్చిన సినిమా సప్తపది. సమాజంలో కట్టుబాట్లు, ఛాంధస భావాలు బలంగా ఉన్న ఆరోజుల్లోనే కళాతపస్వి కె.విశ్వనాథ్ తెగించి తీసిన కళాఖండం సప్తపది. ఈ సినిమా ద్వారా సమాజంలో ఉన్న అసమానతల్ని ఎత్తిచూపారు విశ్వనాథ్. కేవలం కులాల ప్రస్తావన మాత్రమే కాకుండా అప్పటికే పెళ్లయిన యువతికి మరో పెళ్లి చేయాలనే హేతువాద ఆలోచన కూడా ఈ సినిమాలో ఉంది. ఇది 51ఏళ్ల నాటి సినిమా అంటే ఇప్పటికీ నమ్మలేరు ప్రజలు. ఇప్పుడున్న జనరేషన్‌లో సామాజీక అంశంతో వస్తున్న సినిమాలు ఎంతగానో వ్యతిరేకత మూటగట్టుకుంటుండగా.. ఈ కథను ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా విశ్వనాథ్ నడిపిన తీరు అద్భుతమే.
కథ లేని కథ
మన దగ్గర కథలు లేవు అని గట్టిగా ఆలోచిస్తే.. నవలలు కథలు అవుతాయి.. ఆ తరహా కథలే సినిమాలకు మూలం అవుతాయి. కానీ ఇక్కడి సినిమాకు రాజ్య హింస నేపథ్యం తొణికిసలాడుతున్నది. దళితుల సమస్యలన్నీ రాజ్య హింస నుంచి వచ్చాయి.. కొన్ని కులాల తప్పిదాల కారణంగా వచ్చిన వెనుకబాటు నుంచి వచ్చాయి. అగ్ర వర్ణాలు తాము దిద్దుకోలేని తప్పులు చేయడం వలనే వచ్చాయి. కానీ, కొన్ని సినిమాలను పూర్తిగా సామాజిక అంతరాలు కాకుండా పేద ధనిక అనే ఆర్థిక అంతరాలతో కూడా తెరకెక్కిస్తున్నారు.
నిజానికి, కుల వివక్షపై సినిమాలు తీస్తున్న దర్శకులు నేటి సమాజంలోని వివక్షను చూపించకుండా దశాబ్దాల కిందటి కాలం ఎందుకు ఎంచుకుంటున్నారు? ఉదాహరణగా కర్ణన్, అసురన్, పలాస, ఉప్పెన. కాంటెంపరరీ వివక్ష కథలే, ఇందులో ఒక వర్గాన్ని చెప్పకుండానే.. చూపించకుండానే చిన్నగా చూపిస్తున్నారు. అంతేకాదు.. ‘దొరసాని’ అనేది 2019 తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. కేవీఆర్మహేంద్ర నుంచి వచ్చిన ఈ సినిమాలో దొర రాజా రెడ్డి కుమార్తె దొరసాని దేవకి కథను చెబుతుంది, అతను తక్కువ కులానికి చెందిన పెయింటర్ కొడుకు రాజుతో ప్రేమలో పడతాడు. చివరకు కులాన్ని ఒప్పుకోలేక ఇద్దరినీ కాల్చేస్తారు. ఇక, 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి కూడా ఒక విధంగా కులాల మధ్య అంతరాలనే చూపిస్తుంది.
నిజానికి, ఇప్పుడు రాజకీయ పార్టీలు కుల ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలలో మునిగి తేలుతున్నందున భారతదేశ రాజకీయాలలో పెద్ద వివాదంగా మారింది. కానీ, భారతీయ సినిమాలో అనేక సినిమాలు సంస్కరణవాద సూత్రాలతో వచ్చాయి. అయితే, కుల ఆధారిత పేర్లతో రూపొందించబడిన కొన్ని భారతీయ తెలుగు చలనచిత్రాలు కులాలను కించపర్చే విధంగానే ఉంటున్నాయి.
తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిని చిత్రం ‘పెద్ద కాపు’, ఈ పేరు చూస్తేనే సగం సినిమా అర్థమవుతుంది.
ఇక, సాయి పల్లవి మరియు నాగ చైతన్య నటించిన శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ , బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకున్నా.. ఇది కుల మరియు లింగ వివక్ష యొక్క సామాజిక సమస్యల చుట్టూ తిరిగే తెలుగు చిత్రం. ఈ చిత్రంలో నాగ చైతన్య దళిత క్రిస్టియన్ అయిన రేవంత్ పాత్రలో, సాయి పల్లవి అగ్ర కులానికి చెందిన మౌనిక పాత్రలో నటించారు. సానుభూతి, ఆదరించే వర్ణనలతో విసిగిపోయిన దళితులు.. అలాగే తెరపై కుల హింసకు సంబంధించిన దోపిడీ చిత్రణలు ఆవిష్కరించారు.
ఇలాగే రంగస్థలం (2018), ఉప్పెన (2021)లో దళితుడు కథానాయకుడిగా నటించిన చిత్రాలు వచ్చాయి. సినిమా నిర్మాతలు ప్రేక్షకుల నుండి సానుభూతిని రేకెత్తించడానికి ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. దళిత పాత్రలను స్పష్టంగా చూపిస్తూనే ఉంటారు. అంతేకాదు.. ఉప్పెనలో వైష్ణవ్ తేజ్ దళిత వ్యక్తిగా నత్తిగా నటించాడు. రంగస్థలంలో రామ్ చరణ్ తేజ వినికిడి లోపం ఉన్న దళిత వ్యక్తిగా నటించాడు. ఇక, 2020లో వచ్చిన కలర్ ఫోటోలో కూడా ఒక దళిత హీరో కూడా తన స్కిన్ టోన్ కోసం ఎగతాళి చేయబడినట్లు చూపించారు. ఇలా దొరసాని, ఎవరికి చెప్పొద్దు, అర్జున్ రెడ్డి, రుద్రవీణ, సప్తపది, సీతకోక చిలుక, ఉప్పెన, కంచె వంటి కులాంతర సంబంధాలను చిత్రీకరించిన సినిమాలో ఇవన్నీ.
సినిమాను నిషేధించాలని…!
1938లో లవ్ స్టోరీగా విడుదలైన మాల పిల్ల సినిమాను నిషేధించేందుకు కొంతమంది పెద్ద వివాదమే చేశారు. కాకినాడ, విజయవాడలోని సంప్రదాయవాద బ్రాహ్మణులు దీనిని నిషేధించాలని పెద్ద వివాదాన్ని సృష్టించారు. కాంగ్రెస్ అనుకూల రాజకీయ ప్రచారం, గాంధీయిజం మరియు కుల వ్యతిరేక చిహ్నమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను చూపించక చూపించినట్టే అని విమర్శించినప్పటికీ మాల పిల్ల చిత్రం అప్పుడే ఆకట్టుకున్నది.
ఇక, దర్శకుడు తేజ 2003లో తీసిన జయం చిత్రంలో కథనాయకుల సంబంధానికి కులం అడ్డుగా ఉన్నప్పటికీ, అది ధనిక అమ్మాయి మరియు పేద అబ్బాయి అనే వర్గ సమస్యగా చూపించారు. కానీ, ఇందులో సదా అగ్రవర్ణ నేపథ్యం నుంచి వచ్చిన మహిళగా కనిపిస్తే, నితిన్ నిరుపేద కుర్రాడిగా చూపించారు. ఇలా ఇటీవల వచ్చిన కేరాఫ్ కంచరపాలెం (2018), దొరసాని (2019), కలర్ ఫోటో (2020), ఉప్పెన (2021) మరియు లవ్ స్టోరీ (2021) వంటి వాటిలో కొన్ని సమస్యాత్మక రాజకీయాలు ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం కులం గురించి మాట్లాడాయి. ఉప్పెనలో రాయణం (విజయ్ సేతుపతి పోషించిన పాత్ర) తన కూతురితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు వైష్ణవ్ తేజ్ పోషించిన పురుషుడి జననాంగాలను తొలిగించాడు. కానీ, హీరో అతన్ని క్షమించాడు. దొరసానిలో అగ్రవర్ణానికి చెందిన కథానాయికను దేవదూతగా చూపించి, ఆమె తనపై పడిపోతున్నందుకు హీరో కృతజ్ఞతను చూపించారు.
కారంచేడు ఘటన గుర్తుందా
దళితుల ఊచకోతకు నిదర్శనం కారంచేడు ఘటన. కారంచేడు సంఘటన తరువాత నటుడు వెంకటేష్ తీసిన సినిమా జయం మనదేరా (2000) విడుదలైంది. ఈ చిత్రంలో దళితులపై కుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా స్పష్టంగా తీశారు.
కులాధిపత్య పేర్లు కూడా
ఇండస్ట్రీలో విచిత్రమేమిటంటే కులం గురించి మాట్లాడేందుకు ఇష్టపడని ఇండస్ట్రీ.. కుల ఆధిపత్యాన్ని చూపిస్తూనే.. కుల ఆధిపత్యం గురించి, అది కూడా టైటిల్స్ లో కులం పేర్లతో ఎన్నో సినిమాలు చేసింది. ఇలాంటి సినిమాల్లో 1982లో విడుదలైన జస్టిస్ చౌదరి. బహుశా టైటిల్‌లో కులం పేరు ఉన్న మొదటి సినిమా. ఈ చిత్రం కుటుంబ కథా చిత్రం అయినప్పటికీ, ఇది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, కమ్మలు దీనిని కుల చిత్రంగా భావించారు. ఇటీవల తీసిన అర్జున్ రెడ్డిలో కూడా హీరో తన కులం పేరును బయటపెట్టి వ్యంగ్యంగా కులాంతర ప్రేమపై ప్రసంగాలు చేస్తాడు.
నిజానికి, అనేక పౌరాణిక మరియు భక్తి వినోదాలలో బ్రాహ్మణ కులాల ప్రస్తావనలను చూపించారు. అక్కినేని నాగేశ్వర్రావు, నాగార్జునల భక్తిరస చిత్రాలు, మరియు కే విశ్వనాధ్ సినిమాలు కూడా బ్రాహ్మణ సమాజం మరియు వారి సంస్కృతి నేపథ్యంలోనే చూపించబడ్డాయి. అయితే, కొన్ని సినిమాలు కుల వ్యవస్థ మరియు నిర్దిష్ట కులాల ఆధిపత్యాన్ని ప్రశ్నించాయి . ‘సీతకోక చిలుక’, ‘సప్తపది’, ‘దేవాలయం’ వంటి సినిమాలే ఉదాహరణ. ‘గుండమ్మ కథ’లో సూర్యకాంతం ‘మేము కాపులం’ అన్నప్పుడు ‘మేము పెద కాపులం’ అని ఎన్టీఆర్ బదులిస్తే ‘మిస్సమ్మ’లోనూ అదే కుల ప్రస్తావన కనిపించింది. ‘జస్టిస్ చౌదరి’, ‘రాయలసీమ రామన్న చౌదరి’, ‘నరసింహా నాయుడు’ తదితర సినిమాల్లో కమ్మ కులానికి సంబంధించిన ప్రస్తావనలు సినిమా టైటిల్స్ ద్వారా గానీ, సినిమాల్లోని కీలక పాత్రధారుల ఇంటిపేర్ల ద్వారా గానీ ఉన్నాయి. ‘ఇంద్ర’, ‘సమరసింహారెడ్డి’, ‘ఆది’ వంటి చిత్రాలలో రెడ్డి సామాజికవర్గానికి సంబంధించిన ప్రస్తావనలు తీసుకువచ్చారు. శ్రీ కృష్ణ భగవానుడి జీవితానికి సంబంధించిన చాలా సినిమాల్లో ‘యాదవ’ కులాల ప్రస్తావనలు ఉన్నాయి. ‘స్వయంకృషి’లో చిరంజీవిని మాదిగ సామాజికవర్గానికి చెందిన చెప్పులు కుట్టేవాడిగా చూపించారు.
స్వేచ్ఛ హద్దు దాటకూడదు మిత్రమా
కానీ, చివరకు చెప్పేదేమిటంటే.. సినిమాల్లో వివిధ కులాల నేపథ్యాలను, ఆధిపత్యాలను, కించపర్చడం, చంపడం వంటి వివాదాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వాటిని చూపించారు కూడా. ఇలా కులాల చిచ్చు, కుల, మతాల లొల్లిని చూపించేందుకు చిత్ర దర్శకులు, నిర్మాతలకు వారి స్వంత స్వేచ్ఛ ఉంటుంది. అయితే, ఈ స్వేచ్ఛతో ఎవరూ బాధపడకుండా చూసుకోవాలి. కానీ, ఇప్పుడు ఏదో ఒక కులం మాత్రం బాధపడుతుందని గుర్తించాలి.