Wednesday, April 2, 2025

ఢిల్లీ లిక్కర్​ స్కాంలో కవితకు సీబీఐ నోటీసు

టీఎస్​, న్యూస్ ​: పార్లమెంట్​ ఎన్నికలకు ముందు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమెల్సీ కవితకు ఈసారి సీబీఐ నోటీసులు పంపింది. విచారణ కోసం ఈ నెల 26న ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు రావాలని కోరింది. కాగా, సీబీఐ, ఈడీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళలను ఇంటి దగ్గరే విచారించేలా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఇదివరకు కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉంది. సుప్రీంకోర్టు దీనిపై తీర్పు ప్రకటించాకే, కవిత ఢిల్లీలో విచారణకు రావాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. ఐతే.. సుప్రీంకోర్టు ఎప్పుడు విచారణ పూర్తి చేస్తుంది, ఎప్పుడు తీర్పు ఇస్తుంది? అనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే సీబీఐ నుంచి కవితకు మళ్లీ నోటీసులు అందాయి. నిజానికి, ఈ కేసులో ఇదివరకు మూడుసార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలో ఈడీ విచారణ చేపట్టిన సమయంలో కవితను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈడీ అధికారుల తీరుపై అభ్యంతరం చెప్పారు. కానీ, సుప్రీం కోర్టులో పిటిషన్​ విచారణలో ఉన్నది. ఇలాంటి సమయంలో సీబీఐ మరోసారి కవితను విచారణకు పిలిచింది. ఆఫీస్​కు పిలిచి ఈడీ విచారించగా.. అంతకు ముందు సీబీఐ అధికారులు కూడా కవిత ఇంటి దగ్గరే విచారించి, స్టేట్​మెంట్​ తీసుకున్నారు. కానీ, ఇప్పుడు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని, ఈ నెల 26న విచారణ ఉందని సీబీఐ నోటీసులు పంపింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com