Monday, September 30, 2024

పరీక్షల నిర్వహణలో మోడీ సర్కార్ విఫలం

  • నీట్ అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలి
  • విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి
  • సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేయాలి
  • శాంతి భద్రతల విషయంలో సర్కార్ అప్రమత్తం
  • రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పరీక్షల నిర్వహణలో మోడీ సర్కార్ విఫలమైందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పరీక్షల నిర్వహణలో మోడీ సర్కార్ తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. నీట్ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన కోరారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలువురు రాజకీయ నేతలు, నిపుణులు స్పందించారు. తాజాగా ఈ పరీక్షపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. నీట్ పరీక్షకు సంబంధించిన అవకతవకలపై కేంద్రం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

63 మందికి ఒకటే ర్యాంక్ వచ్చిందన్న మంత్రి విద్యార్థులకు అన్యాయం జరగకూడదని కాంగ్రెన్ ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు నీట్ పరీక్షతో పాటు, తెలంగాణ జాబ్ క్యాలెండర్, ఇతర పరీక్షల విషయంపై మాట్లాడారు. సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 9 నుంచి నెలరోజుల పాటు కేంద్ర సర్కార్ దరఖాస్తులకు అనుమతించింది. ఆ తర్వాత మరో వారం రోజులు గడువు పొడిగించింది. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల కంటే ముందే కొన్ని ఘటనలు జరిగాయి.

జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉంది. కానీ జూన్ 4న రిజల్ట్ ఇవ్వడంతో అనుమానాలు మరింత పెరిగాయి. విద్యార్థులు అనేక సంఘాలు ఆందోళన చేశాయి. 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంక్ రావడం మరింత అనుమానానికి తావిచ్చింది. పోటీ పరీక్షల నిర్వహణలో ప్రధానంగా వైద్య విద్యలో అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని శ్రీధర్ బాబు అన్నారు. గ్రేస్ మార్కులను కలపడంపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు మళ్లీ నమ్మకం కలిగేలా కేంద్రం ఈ విషయంలో వ్యవహరించాలని సూచించారు.

సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేయాలి

గనుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఒక విషయం చెబుతున్నా. లాభాల్లో నడుస్తున్న సంస్థ సింగరేణి సంస్థ. కార్మికుల నైపుణ్యంతో ఆ సంస్థ చాలా బలంగా ఉంది. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని శ్రీధర్‌బాబు అన్నారు. ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి చెబుతున్నాని, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే చేయాలన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పునరాలోచన చేయాలని, ఓవైపు సింగరేణిని ప్రైవేటుపరం చేయమంటూనే మరోవైపు ప్రైవేటు వ్యక్తుల చేతికి కట్టబెట్టే పనిలో కేంద్రం ఉందన్నారు. అన్ని బొగ్గు నిక్షేప సంస్థలు లాభాల్లో ఉన్నాయని శ్రీధర్ బాబు అన్నారు.

శాంతి భద్రతల విషయంలో సర్కార్ అప్రమత్తం

రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో సర్కార్ అప్రమత్తంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా సహించమని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఏపీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్న శ్రీధర్ బాబు వారి సంక్షేమం దిశగా తమ పాలన సాగుతుందని పునరుద్ఘాటించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించామన్నారు.

గ్రూప్ 2,3లో పోస్టుల సంఖ్య పెంచాలని కొందరు ధర్నా చేస్తున్నారని, దాదాపు ఐదున్నర లక్షల మంది దరఖాస్తు చేశారని వాటిని నిర్వహిస్తామని అన్నారు. ఖాళీలను గుర్తించి త్వరలో గ్రూప్-2,3కి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ కూడా త్వరలోనే ఇస్తామన్నారు. న్యాయ పరమైన సలహాలు తీసుకుని జీవో 46 పై డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. గ్రూప్ -1 విషయంలో 1:50 కి బదులుగా 1:100 ప్రాతిపదికన తీయాలని నిరుద్యోగులు అడుగుతున్నారని దానిపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Actress Kriti Sanon New Stills

Mrunal Thakur Latest Pics

Actress Shriya Saran new pics