Thursday, January 30, 2025

సీసీఎస్‌కు సువర్ణభూమి కేసు

వెంచర్ల పేరుతో భారీ మోసానికి పాల్పడిన సువర్ణభూమి రియల్ సంస్థ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. లాభాల ఆశ చూపి 200 మంది కస్టమర్ల నుంచి దాదాపు రూ. 1.55 కోట్లు వసూలు చేసి మొహం చాటేసింది. ఎండీ శ్రీధర్‌, డైరెక్టర్ దీప్తి చెల్లని చెక్కులు ఇచ్చి నిలువునా ముంచారంటూ కస్టమర్లు పోలీసులను గతేడాది డిసెంబర్‌లో బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు ఈ కేసును విచారణ చేస్తున్న బంజారాహిల్స్‌ పోలీసుల నుంచి సీసీఎస్‌కు బదిలీ చేస్తూ రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకున్నారు.

అసలేం జరిగింది..?
లాభాలు ఆశ చూపిన సువర్ణ భూమి రిల్‌ సంస్థ పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టింది. మాయమాటలతో కోట్లు వసూలు చేసి మరికొందరికి టోకరా వేసింది. స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ సంస్థ.. భారీ ఎత్తున ప్రచారం చేసి ఘరానా మోసానికి పాల్పడింది. సినీ నటులతో ఆకర్షణీయమైన ప్రకటనలు చేయించి భారీ స్థాయిలో వసూలు చేసిన సదరు సంస్థ.. బైబ్యాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట 30 లక్షల నుంచి రెండు కోట్ల వరకు స్వాహా చేసింది. పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తరువాత 24 శాతం లాభాలు ఇస్తామని ఆశ కల్పించి చివరికి చెల్లని చెక్కులు ఇచ్చి కస్టమర్లను నిలువునా ముంచింది. దీంతో గతేడాది డిసెంబర్‌లో సువర్ణభూమి ఎండీ శ్రీధర్‌, డైరెక్టర్ దీప్తిపై బాధితులు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లోని వెంచర్లు చూపించి భారీ వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు శ్రీకాంత్‌శర్మ, వేణుగోపాల్, శ్రీనివాస్‌రెడ్డి, కల్పన పిటిషన్‌లో పేర్కొన్నారు. గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో సువర్ణభూమిపై బాధితులు సీసీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశారు. మూడేళ్ల నుంచి సువర్ణభూమి డైరెక్టర్లు మోసం చేస్తున్నారని, చెల్లని చెక్కలు ఇచ్చి, వారి కార్యాలయల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు కేసు పెట్టారు. ప్రముఖ సినీ హీరోలు సువర్ణ భూమిని ప్రమోట్ చేస్తుండడంతో నమ్మి మోసపోయామని, 200 మంది భాధితులు ఉన్నామని, రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మోసం జరిగిందని లబోదిబోమంటున్నారు. రూ.35లక్షల రిటైర్మెంట్ డబ్బులు సువర్ణభూమిలో ఇన్వెస్ట్ చేస్తే మోసం చేశారని రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు మరో పిటిషన్‌ ఇచ్చారు. దీనిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే, సువర్ణ భూమి మోసాల చిట్టా పెద్దగా ఉండటంతో.. ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com