Monday, March 10, 2025

OYO Rooms: ఓయో రూమ్లో సీసీ కెమెరాలు

ఓయోలో రూమ్ బుక్ చేసుకుంటున్నారా… అయితే జాగ్రత్త.. ఎందుకంటే.. ఓయోలోని బెడ్ రూంలోని బల్బ్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి, బాధితులను బెదిరిస్తున్నాడో నిర్వాహకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్‌ అనే ఓ యువకుడు ఉఫాధి కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. శంషాబాద్‌లో సిటా గ్రాండ్‌ ఓయో హోటల్‌ పేరుతో లాడ్జి నిర్వహిస్తున్నాడు. అయితే ఇక్కడికి ఎక్కువగా యువత వస్తుండటంతో మనోడి మనసు మరో దారి మల్లింది.

రహస్యంగా రూమ్ ల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు. అది కూడా బల్బుల హోల్డర్లలో బిగించాడు. దీనిని తన సెల్ ఫోన్ లో మానిటరింగ్‌ చేస్తూ ఆ వీడియోలను రికార్డు చేసేవాడు. రూమ్ అద్దెకు తీసుకున్న వారికి ఆ ఫోటోలను, వీడియోలను చూపించి బెదిరింపులకు దిగేవాడు. ఇలాగే ఓ జంటను కూడా బెదిరించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మొత్తం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి సీక్రెట్ కెమెరాలతోపాటుగా 2 సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడి సెల్‌ ఫోన్లలో బాధితుల అశ్లీల వీడియోలు, చాలామంది యువతుల ఫొటోలు ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com