Saturday, November 16, 2024

ఘనంగా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి వేడుకలు

అబుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు , నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

స్థానిక 1టౌన్ బ్రాహ్మణ వీధిలోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నందు సోమవారం నాడు ఘనంగా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు గారు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అబుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, అబుల్ కలాం గారు ఈ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ భారత రత్న, భారత దేశానికి తోలి విద్యా శాఖ మంత్రిగా సేవలందించిన అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. అబుల్ కలాం గారు భారత దేశం కోసం అనేక సేవలు అందించారని ఎన్నో త్యాగాలు చేశారని, స్వతంత్ర సమరయోధుడని అయన సేవలు చిరస్మరణీయమన్నారు. అబుల్ కలం లాంటి మహానీయులను అందరు గుర్తుపెట్టుకోవాలని అందరూ అతని అడుగుజాడల్లో నడిచి వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలన్నారు.

అబుల్ కలాం గారి మహనీయుల ఆశయాలు ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్లాలంటే అది కేవలం జగన్ మోహన్ రెడ్డి గారికే సాధ్యమని అన్నారు. భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఎనలేని సేవలందించారని, విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేశారన్నారు. అబుల్ కలాం ఆజాద్ గారి బాటలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు నడిచి విద్యా విధానంలో అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం వాటిని కొనసాగించకపోవడం చాల బాధాకరం అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular