రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేసిన ప్రముఖులు
సీఎం సహాయ నిధిలో విరాళాలు భారీగా జమా అవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ మొత్తంలో పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన తరఫున రూ.50 లక్షలు, తన కుమారుడు రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షల చెక్కును అందజేశారు. ప్రముఖ నటులు విశ్వక్‌సేన్ రూ.10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, హాస్యనటడు అలీ రూ.3లక్షలు విరాళంగా అందజేశారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళంగా అందజేశారు. గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు విరాళంగా అందజేసింది.