-కొడతారు..పరామర్శిస్తారా
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన నివాసంలోకి ప్రవేశించిన మీడియా రిపోర్టర్లపై మోహన్ బాబు ఉగ్రరూపం ప్రదర్శించారు. టీవీ9 చానల్ రిపోర్టర్ రంజిత్ కుమార్ చేతిలోంచి మైక్ ను లాక్కున్న మోహన్ బాబు… ఆ మైక్ తో సదరు రిపోర్టర్ పై దాడి చేశారు. గాయపడిన రిపోర్టర్ రంజిత్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి రంజిత్ కుమార్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు.
ఆ రిపోర్టర్ కు క్షమాపణలు తెలియజేశారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత రిపోర్టర్ కుటుంబ సభ్యులతోనూ మోహన్ బాబు మాట్లాడారు. ఆ రోజు తన నివాసంలో జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇక దీని పై కొంతమంది నెటిజన్లు ఈ విధంగా స్పందిస్తున్నారు. అంటే సెలబ్రెటీలంటే ఏది చేసినా పర్వాలేదా. వారు ఏమైనా చేయవచ్చా. కొట్టేసి మైకులు విరగొట్టి..విలేకరులపైన కనీస గౌరవం లేకుండా కొట్టడం దుర్భాషలాడటం వంటివి చేసి తిరిగి సారీ అనేసి చికిత్స వివరాలు కనుక్కుని దానికి అయ్యే ఖర్చు భరిస్తే చాలా అంతా అయిపోతుందన్నమాట. అంటే ఎవ్వరికీ ఆత్మగౌరవం వాళ్ళ బాధతో సంబంధం ఉండదన్నమాట. పర్సనల్.. మా కుటుంబ వివాదం అనుకునేది ఇంటి వరకు ఉన్నంతవరకు మాత్రమే. అది ఎప్పుడైతే వీధిలోకి వచ్చిందో నలుగురినోట పడి నలుగురిలోకి వచ్చిందో అది పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది తప్పించి పర్సనల్ అవ్వదు.
పర్సనల్ అనుకుంటే నాలుగుగోడల మధ్య మాత్రమే జరగాలి. కానీ ఈ విషయం ఇంత గడప దాటింది. దీంతో మీడియావాళ్ళు అటెన్షన్ అవ్వవలసి వచ్చింది. అందులోనూ సెలబ్రెటీ లైఫ్ అంటే ప్రతి ఒక్కరికీ ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది. ఎవ్వరైనా సరే తొంగి చూడాలనే అనుకుంటాడు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే గత రాత్రి మళ్ళీ మనోజ్ తన ఇంట్లో మంచువిష్ణు చొరబడి ఏవో కొన్ని ధ్వంశం చేశారని వాళ్ళకు ప్రాణభయం ఉందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యి అంతా చట్ట ప్రకారమే జరుగుతోందని… అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. మోహన్ బాబును విచారించేందుకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు.
మోహన్ బాబుకు తాము ఇప్పటికే నోటీసులు ఇచ్చామని… అయితే ఆయన డిసెంబర్ 24వ తేదీ వరకు సమయం అడిగారని సీపీ చెప్పారు. కోర్టు కూడా ఆయనకు సమయం ఇచ్చిందని తెలిపారు. 24వ తేదీ తర్వాత నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తామని చెప్పారు. మోహన్ బాబు దగ్గర ఉన్న గన్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో లేవని తెలిపారు. ఆయన వద్ద ఉన్న గన్స్ ను చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డిపాజిట్ చేశారని చెప్పారు. తాను దాడి చేయడంతో జర్నలిస్టు గాయపడ్డారు కాబట్టి… ఆయనను పరిమర్శించేందుకు మోహన్ బాబు వెళ్లి ఉంటారని తెలిపారు.