Saturday, February 8, 2025

సెల్లార్‌ తవ్వకాల్లో దారుణం ముగ్గురు బిహార్‌ కూలీల మృతి

హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగాపైనుంచి మట్టిదిబ్బలు కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కూలీని మట్టిదిబ్బల నుంచి బయటకు తీసి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి చికిత్స అందిస్తున్నారు. మట్టి దిబ్బల నుంచి ఓ మృతదేహాన్ని బయటకు తీయగా.. మరో ఇద్దరి డెడ్ బాడీలను బయటకు తీసేందుకు ఫైర్, పోలీసు సిబ్బంది శ్రమిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు కూలీలు బిహార్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత అతికష్టం మీద మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన ముగ్గురు బీహార్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులు వీరయ్య, వాసు, రాములుగా తెలుస్తోంది. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా సెల్లార్‌లో మట్టిదిబ్బలు కూలి పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు తండ్రీ, కొడుకులు ఉన్నట్లు గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పనిచేసే ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
అయితే సెల్లార్ తవ్వకాలు జరుపుతున్న సమయంలో జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సెల్లార్ తవ్వే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతున్న క్రమంలో పెద్ద ఎత్తున సెల్లార్‌ కోసం తవ్వకాలు చేపట్టారు. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున పేలుళ్లు జరుపుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోని పరిస్థితి. ఈ సెల్లార్లన్నీ కూడా 40 అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్దఎత్తున సెల్లార్ల తవ్వకం చేస్తున్నప్పటికీ కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించారని.. జీహెచ్‌ఎంసీ అధికారులు పర్మిషన్లు ఇవ్వడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com