Monday, March 10, 2025

ఎస్‌డీఆర్‌ఎఫ్‌​ నిధుల వినియోగానికి కేంద్రం గ్రీన్​ సిగ్నల్​

  • ఒకే వాడుకోండి
  • ఎస్‌డీఆర్‌ఎఫ్‌​ నిధుల వినియోగానికి కేంద్రం గ్రీన్​ సిగ్నల్​

తెలంగాణలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు వినియోగానికి కేంద్రం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో వానలు సృష్టించిన బీభత్సంపై కేంద్రమంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షాను కలిసి నిధుల వినియోగంపై విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌​ నిధుల వినియోగం, మంజూరుపై రాష్ట్ర కేంద్ర మంత్రులు కేంద్ర హోంశాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. దానికి అమిత్​ షా సానుకూలంగా స్పందించినట్లు బండిసంజయ్ తెలిపారు. అమిత్ షా ఆదేశాలతో కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ఆశిష్​ గవాయ్​ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అకౌంటెంట్​ జనరల్ నివేదిక ప్రకారం రాష్ట్రం వద్ద రూ.1,345కోట్ల ఎన్డీఆర్​ఎఫ్​ నిధులు ఉన్నట్లు ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. కాగా జాతీయ విపత్తుల నిధిని ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రం వద్ద ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌​ నిధులను వాడుకోవాలని సూచించినట్లు తెలిపారు.

యూసీ సమర్పిస్తే ఇంకో రూ. 208 కోట్లు

కేంద్రం నుంచి నుంచి ఎన్డీఆర్​ఎఫ్​ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం యూసీలు సమర్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగంపై యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించకపోవడంవల్లే ఈ ఏడాది జూన్​లో రావాల్సిన రూ.208.40 కోట్లను విడుదల చేయలేదని కేంద్రం పేర్కొంది. యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించింది.

ఏరియల్ సర్వే

అలాగే రాష్ట్రంలో ఎంత మేరకు విపత్తు జరిగిందో తెలుసుకోడానికి ఏరియల్ సర్వే చేయించాలని కేంద్రమంత్రి అమిత్​ షాను కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు, తెలుగు రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే చేయించడానికి కేంద్రం సిద్ధమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం బృందం సర్వే చేయనుంది. వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించడానికి బీజేపీ ఇద్దరు నేతలతో రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఈనెల 6తేదీన రెండు బృందాలు వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తాయని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో సంకినేని వెంకటేశ్వరరావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో మహబూబాబాద్, ములుగు ప్రాంతాలలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రామారావు పాటిల్ పర్యటిస్తారని వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com