Sunday, September 29, 2024

“విశాఖ స్టీల్” కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం  ముమ్మర ప్రయత్నాలు 

“విశాఖ స్టీల్” (కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ) మనుగడ సాగించేందుకు  కేంద్ర పరిశీలనలో ప్రతిపాదనలు
సుమారు 35 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న “విశాఖ స్టీల్” కు జవసత్వాలు ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రం
“విశాఖ స్టీల్” గా పిలిచే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ “రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్”(ఆర్.ఐ.ఎన్.ఎల్) ను మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన “సెయిల్” ( స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా) లో విలీనం చేసే ఆలోచనలో కేంద్రం
కేంద్రం పరిశీలనలో ఉన్న పలు ప్రతిపాదనల్లో ఇదొక ప్రతిపాదన
* నష్టాల్లో ఉన్న “విశాఖ స్టీల్” ఫ్యాక్టరీ కార్యకలాపాలు కొనసాగేలా పలు ప్రతిపాదనలు.
* “విశాఖ స్టీల్” కు చెందిన భూమిలో  (19 వేల ఎకరాలు) కొంత భూమిని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన “జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ”(ఎన్.ఎమ్.డి.సి) కు అమ్మడం, “విశాఖ స్టీల్” కున్న బ్యాంకుల రుణాలను చెల్లింపు చేయడం మరో ప్రతిపాదన.
* సుమారు 2 వేల ఎకరాలును “ఎన్.ఎమ్.డి.సి” కి అమ్మి, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన “ఎన్.ఎమ్.డి.సి” ఒక “పెల్లెట్ ప్లాంట్” నెలకొల్పే ఆలోచన.
* 7.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న “విశాఖ స్టీల్” ఫ్యాక్టరీ దేశంలోనే తీరప్రాంతంలో నెలకొల్పిన తొలి ఉక్కు కర్మాగారం.
•  ఒక్కో “బ్లాస్ట్ పర్నేస్” 2.5 “మిలియన్ టన్నుల” సమర్ధ్యం తో, మొత్తం మూడు  “బ్లాస్ట్ పర్నేస్”లున్న “విశాఖ స్టీల్” కర్మాగారం.
* మూడు  “బ్లాస్ట్ పర్నేస్” ల్లో పనిచేస్తున్నది కేవలం రెండు మాత్రమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular