Monday, January 27, 2025

నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిన అయ్యన్నపాత్రుడు

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారానికి గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగంలో చేసిన అద్భుతమైన కృషి మాత్రమే కాకుండా, ప్రజాసేవలో చూపిన నిబద్ధత, సంక్షేమ కార్యక్రమాల పట్ల కనబరిచిన చొరవ తదితరాలన్నింటికీ ఈ అత్యున్నత సత్కారం ఒక గొప్ప గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

తెలుగు సినీ రంగంలో బాలకృష్ణ గారి కృషి అపారమైనదని, ఆయన నటనకు ఉన్న విశిష్టత తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు అభిప్రాయపడ్డారు. ఆయనకు ఈ గౌరవం దక్కడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం మాత్రమే కాకుండా, భారతీయ కళా ప్రపంచంలో తెలుగు ప్రజల ప్రతిభకు మళ్ళీ మరొకసారి గౌరవనీయమైన గుర్తింపుగా నిలుస్తుందన్నారు.

ఈ పురస్కారం బాలకృష్ణ గారి భవిష్యత్తుకు మరింత ప్రేరణ కలిగిస్తుందని, ఆయన మరిన్ని గొప్ప విజయాలు సాధించి, ప్రజల మనసులో చిరస్థాయిగా నిలవాలని స్పీకర్ ఆకాంక్షించారు. అలాగే, బాలకృష్ణ గారు ప్రజాసేవలో కొనసాగిస్తూ, తెలుగు సినీ రంగానికి మరిన్ని సేవలందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com