Saturday, May 10, 2025

రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

పీఎం కిసాన్‌ డబ్బుల పంపిణీకి రంగం సిద్దం

ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వ్యవసాయంలో రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకానికి సంబందించిన నిధులను విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. ఈనెల 18న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 17వ విడతను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసే ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

పీఎం కిసాన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ పథకం కింద, దేశంలోని రైతులకు సంవత్సరానికి 6 వేల రూపాయలు అందిస్తోంది మోదీ సర్కార్. ఆన్‌లైన్‌ బదిలీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ సొమ్మును జమ చేస్తోంది. ఈ సొమ్మును ఒక్కొక్కరికి 2 వేల చొప్పున మూడు విడతలుగా రైతులకు అందజేస్తున్నారు. 17వ విడతతో దేశవ్యాప్తంగా సుమారు 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్లు ఇచ్చేందుకు సర్వం సిద్దం చేసింది కేంద్ర ప్రభుత్వం.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com